కెసిఆర్‌తో టీ హీరో నితిన్ భేటీ, జయకృష్ణ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును సినీ ప్రముఖులతో పాటు ఇతరులు కూడా కలుస్తున్నారు. తాజాగా, సినీ హీరో నితిన్ కెసిఆర్‌ను కలిశారు. తెలంగాణ నుంచి ఎదిగిన మాస్ హీరో నితిన్ ఒక్కరే. నితిన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమాని కూడా.
ఇంతకు ముందు కెసిఆర్‌ను ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ, హీరో కళ్యాణ్ రామ్ కలిశారు. తాజాగా శుక్రవారంనాడు ఎన్టీ రామారావు మరో కుమారుడు నందమూరి జయకృష్ణ కలిశారు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కూడా ఇంతకు ముందు కలిశారు.
ఇతర వర్గాలకు చెందిన పలువురు కెసిఆర్‌ను కలుస్తున్నారు. ప్రముఖ తెలంగాణ గాయకుడు జయరాజ్ కెసిఆర్‌ు శుక్రవారంనాడు కలిశారు. బ్రహ్మకుమారిలు కలిసి కెసిఆర్‌ను కలిసి అభినందించారు.

కెసిఆర్‌తో నితిన్
తెలంగాణకు చెందిన మాస్ హీరో నితిన్ శుక్రవారంనాడు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిశారు.

కెసిఆర్‌తో ఫ్యాప్సీ ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును శుక్రవారంనాడు ఫ్యాప్సీ ప్రతినిధులు కలిశారు.

కెసిఆర్‌తో జయకృష్ణ భేటీ
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఎన్టీ రామారావు తనయుడు నందమూరి జయకృష్ణ కలిశారు.

కెసిఆర్‌ను కలిసిన ముఖేష్
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ముఖేష్ కుమార్ తదితరులు కలిశారు.

కెసిఆర్‌తో బ్రహ్మకుమారీలు..
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావును బ్రహ్మకుమారీలు కలిసి అభినందనలు తెలిపారు.

కెసిఆర్‌తో జయరాజ్
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ప్రముఖ తెలంగాణ గాయకుడు, కవి జయరాజ్ కలిశారు. తెలంగాణ ఉద్యమానికి జయరాజ్ తన గానంతో సహకారం అందించారు.












Click it and Unblock the Notifications