వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ విముక్తి: ఆపరేషన్ పోలో (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో వివాదంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇది వివాదంగానే ఉంది. నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనమైన రోజు అది. నిజాం అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ముందు లొంగిపోవడంతో హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో భాగమైంది.

ఓ వైపు దేశమంతా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకుంటూ ఉంటుంటే హైదరాబాద్ ప్రజలు మాత్రం నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీ వరకు హైదరాబాద్ ప్రత్యేక రాజ్యంగానే ఉంది. ఇండియన్ యూనియన్ ఆపరేషన్ పోలో ద్వారా దాన్ని తనలో అంతర్భాగం చేసుకుంది.

నిజాం లొంగిపోయిన తర్వాత 1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి అనే సీనియరు ప్రభుత్వ అధికారిని ముఖ్యమంత్రిగా నియమించి, నిజామును రాజ్‌ ప్రముఖ్‌ గా ప్రకటించారు. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది.

అయితే, సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. కానీ, మజ్లీస్ దాన్ని వ్యతిరేకిస్తోంది. ముస్లిం మైనారిటీల మనోభావాలు దెబ్బ తింటాయనే భావనతో ప్రభుత్వాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ స్థితిలోనే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గానీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గానీ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినంగా పరిగణించి సంబరాలు నిర్వహించడానికి ముందుకు రావడం లేదు. మరోవైపు అతివాద కమ్యూనిస్టులు అసలు విమోచన, విముక్తి అనే పదాలనే వ్యతిరేకిస్తున్నారు.

హైదరాబాద్ సైన్యం

హైదరాబాద్ సైన్యం

1946 - 1948ల మధ్య హైదరాబాదు రాజ్యంలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఉద్రిక్తమైనవి. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్ సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి రంగంలోకి దిగడం దానివల్లనే జరిగింది.

రజాకార్ల ఆగడాలు

రజాకార్ల ఆగడాలు

భారత ప్రభుత్వానికి, నిజాంకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారత దేశంలో విలీనానికి నిజాం అంగీకరించలేదు. రజాకార్ల ఆగడాలు మితిమీరిపోయాయి. మరోవైపు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం సాగుతోంది. ఆ స్థితిలో హైదరాబాద్ సైన్యం ఇలా..

యథాతథ స్థితికి ఒప్పందం

యథాతథ స్థితికి ఒప్పందం

వాస్తవ పరిస్థితిని నిజాం రాజుకు అర్ధమయ్యేలా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి, 1947 నవంబర్‌ 29న యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. 1947 ఆగష్టు 15కు పూర్వపు పరిస్థితికి ఒక సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. ఒప్పందంలో భాగంగా హైదరాబాదులో భారత్ తరపున ఏజంట్ జనరల్‌గా కె.ఎం.మున్షీ నియమితుడయ్యాడు.

సైన్య సమీకరణ..

సైన్య సమీకరణ..

1948 ఆగష్టు 9వ తేదీన టైమ్స్ ఆఫ్‌ లండన్‌ లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాద్ 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లక్ష మందితో సైన్యం సిద్ధంగా ఉందని, బొంబాయిపై బాంబులు వెయ్యడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉందని హైదరాబాదు ప్రధాన మంత్రి లాయిక్‌ ఆలీ అన్నాడు.

పోలీసు చర్య ప్రారంభం

పోలీసు చర్య ప్రారంభం

నిజాం చేపట్టిన ఈ చర్యలకు తోడు రజాకార్ల హింస, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వంటి పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాదుపై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది.

ఆపరేషన్ పోలో..

ఆపరేషన్ పోలో..

ఇండియన్ యూనియన్ సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుండి హైదరాబాదును ముట్టడించింది.

సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఆదేశాలతో..

సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఆదేశాలతో..

అప్పటి భారత హోం మంత్రి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఆదేశాలతో భారత సైన్యం నాలుగు వైపుల నుంచీ హైదరాబాద్ భూభాగంలోకి ప్రవేశించింది.

నల్‌దుర్గ్ కోట స్వాధీనం

నల్‌దుర్గ్ కోట స్వాధీనం

హైదరాబాద్ నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన భారత సైన్యం నల్‌దుర్గ్ కోటను స్వాధీనం చేసుకుని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ దిశగా సాగింది.

ఇలా చుట్టుముట్టారు..

ఇలా చుట్టుముట్టారు..

మేజర్ జనరల్ డిఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎఎ రుద్రా మద్రాసు వైపు నుంచి, బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు.

సైన్యాన్ని విరమించుకున్నాడు..

సైన్యాన్ని విరమించుకున్నాడు..

1948 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ చేతుల్లోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో నిజాం హైదరాబాద్ రేడియోలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తన ప్రభుత్వం రాజీనామా ఇచ్చిందని, ఆ పని ఇది వరకే చేయాల్సిందని, అలా చేయనందుకు విచారిస్తున్నానని, యుద్ధం నుంచి సైన్యాన్ని విరమించుకుంటున్నానని, ఐక్యరాజ్య సమితిలలో పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు.

నిజాం చివరి ప్రధాని...

నిజాం చివరి ప్రధాని...

హైదరాబాద్ చివరి నిజాం ప్రధాన మంత్రి మీర్ లాయక్ అలీ ఈయనే. నిజాం ప్రభుత్వానికి మద్దతుగా దౌత్యపరమైన అనేక చర్యలను ఈయన చేపట్టారు.

హైదరాబాద్ పోలీసు కమిషనర్..

హైదరాబాద్ పోలీసు కమిషనర్..

సైనిక చర్య ఆపరేషన్ పోలో జరిగిన సమయంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న నవాబ్ దీన్ యార్ జంగ్ బహదూర్...

నెహ్రూతో పటేల్...

నెహ్రూతో పటేల్...

ఆపరేషన్ పోలో అనేది సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ చొరవతోనే జరిగిందని అంటారు. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అంతగా ఇష్టం లేదని చెబుతారు.

నెహ్రూతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

నెహ్రూతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇలా..

ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు..

ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు..

హైదరాబాద్ రాజ్యంలో కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు అనేక దురాగతాలకు పాల్పడ్డారు. వారు చేయని దుష్టకృత్యం లేదు. ఆ ప్రైవేట్ ఆర్మీ ఇలా..

కాసిం రజ్వీ ఇలా..

కాసిం రజ్వీ ఇలా..

భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. ఆతని ప్రధానమంత్రి మీర్‌ లాయిక్‌ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. .

చివరి రోజుల్లో పాకిస్తాన్‌లో..

చివరి రోజుల్లో పాకిస్తాన్‌లో..

తరువాత ఖాసిం రిజ్వీ కొన్నాళ్ళు భారత దేశంలో జైలు జీవితం గడిపి, విడుదలయ్యాక, పాకిస్తాను వెళ్ళి స్థిరపడ్డాడు. కొన్నాళ్ళకు అక్కడే అనామకుడిలా మరణించాడు.

పటేల్ ముందు లొంగిన నిజాం

పటేల్ ముందు లొంగిన నిజాం

1948 సెప్టెంబర్ 18న నిజాం సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ముందు లొంగిపోయాడు. పోలీసు చర్య ఐదు రోజుల్లో ముగిసింది. 1373 మంది రజాకార్లు హతమయ్యారు.

హైదరాబాద్ రాజ్యం...

హైదరాబాద్ రాజ్యం...

నిజాం ఏలుబడిలో హైదరాబాద్ రాజ్యం ఇలా ఉండేది. భారత యూనియన్ సైనిక చర్యలోమరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు.

సైనిక గవర్నర్‌గా చౌదరి

సైనిక గవర్నర్‌గా చౌదరి

సెప్టెంబర్ 23న భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాము ఉపసంహరించుకున్నాడు. హైదరాబాదు భారతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించాడు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు.

English summary
Indian Union waged fight against Nizam state and Hyderabad state was merged with Indian Union. Indian Union named the police action as Operation polo 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X