పవన్ ఖుషీ: బాలయ్య, లోకేష్ బిజీ (పిక్చర్స్)
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారానికి వచ్చిన జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం ఘనస్వాగతం లభించింది. నందమూరి హీరో, హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ, ఆయన అల్లుడు నారా లోకేష్ అతిథులను ఆహ్వానం పలకడంలో బిజీగా గడిపారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వేదిక ప్రాంగణంలో ఆకాశం తారాజువ్వల వెలుగులతో మిరిమిట్లు గొలిపింది.. తెలుగుదేశం పార్టీ అభిమానులు వందల సంఖ్యలో తారాజువ్వలు ఆకాశానికి పంపి చంద్రబాబుకి అభినందన సుమాలలర్పించారు. వేదికకు దూరంగా పెద్ద పెట్టున బాణాసంచా కాల్చి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మరికొంత మంది మిఠాయిలు పంచుతూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆనంద తన్మయత్వంతో అభిమానులు నృత్యం చేస్తూ తమ హర్షాతిరేకాలు ప్రకటించారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం గవర్నర్ నరసింహన్‌తో పాటు నాగాలాండ్, గోవా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ముఖ్యమంత్రులతో పాటు బీజేపీ అగ్రనేత ద్వానీ, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆరుసార్లు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైన కర్నాటక నేత అనంతకుమార్ తదితర అతిరథ మహారథులు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ పక్కన వివేక్ ఒబెరాయ్...
చంద్రబాబు ప్పరమాణ స్వీకార కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెహరాయ్ పక్కన పవన్ కళ్యాణ్ కూర్చున్నారు.

బాలకృష్ణ ఇలా..
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సభా వేదిక వద్ద అందరికీ స్వాగతం పలుకుతూ బాలకృష్ణ సందడిగా కనిపించారు.

జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
జూనియర్ ఎన్టీఆర్ సభా వేదిక వద్ద నవ్వుతూ ఉల్లాసంగా కనిపించారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కలసి వచ్చారు.

అద్వానీకి చంద్రబాబు స్వాగతం
బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీకి, తదితరులకు చంద్రబాబు స్వాగతం పలికారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద యెత్తున అతిథులు కదిలి వచ్చారు.

చంద్రబాబు నాగిలి ఎత్తారు..
ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాగలి ఎత్తారు.

పవన్ కళ్యాణ్ భుజంపై చేయి వేసి..
పవన్ కళ్యాణ్‌ను నారా చంద్రబాబు నాయుడు ఆలింగనం చేసుకుని, భుజంపై చేయి వేసి తీసుకుని వచ్చారు.

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఇలా..
చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇలా కనిపించారు.

నారా లోకేష్ ఇలా...
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా నారా లోకేష్ సందడి చేస్తూ కనిపించారు. అతిథులకు ఆహ్వానం పలుకుతూ ఉల్లాసంగా కనిపించారు.

హరికృష్ణ ఇలా...
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్టీ రామారావు తనయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ ఇలా కనిపించారు.

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు..
ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు నారా చంద్రబాబు నప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇలా కనిపించారు.

ఎన్డీయే నేతల సరసన పవన్ కళ్యాణ్
ఎన్డీఎ భాగస్వామ్య పక్షం జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకత లభించింది. బిజెపి, ఇతర ఎన్డియే పక్షాల నేతల సరసన ఆయన కనిపించారు.












Click it and Unblock the Notifications