రోజా నో: జగన్‌కు భారతి, చిరుకు నగ్మా (పిక్చర్స్)

హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల తరఫున ప్రధాన ప్రచారకర్తలు రంగంలోకి దిగనున్నారు. దాదాపు అన్ని పార్టీల నుండి సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. కాంగ్రెసు పార్టీ తరఫున సీమాంధ్రలో చిరంజీవి ప్రచారం చేయనున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, సోదరి షర్మిల, తల్లి వైయస్ విజయమ్మలతో పాటు జగన్ సతీమణి భారతి కూడా ప్రచారం చేయనున్నారు.

సీమాంధ్ర ప్రాంతంలో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా జగన్ దూసుకెళ్తున్నారు. ఇందుకోసం ఆయన పదమూడు జిల్లాల్లో ప్రచారం చేయాల్సి ఉంది. దీంతో ఆయన తరఫున పులివెందులలో భారతి ప్రచారం చేస్తారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా వైయస్ విజయమ్మ, జగన్, షర్మిల విస్తృతంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

 భారతి

భారతి

ఆ పార్టీ తరఫున ప్రచారకర్తలుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రెడ్డి కూడా ప్రచారం చేయనున్నారు. ఆమె ఎక్కువ శాతం పులివెందులలో జగన్ తరఫున ప్రచారం చేస్తారు.

లక్ష్మీ పార్వతి

లక్ష్మీ పార్వతి

వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంవి మైసూరా రెడ్డి, కొణతాల రామకృష్ణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైయస్ అనిల్ రెడ్డి, దాడి వీరభద్ర రావు, నందమూరి లక్ష్మీపార్వతి, సినీ రంగానికి చెందిన విజయచందర్, గిరిబాబు తదితరులు ప్రచారం చేయనున్నారు.

రోజా

రోజా

ప్రముఖ నటి, నగరి నియోజవకర్గం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున బరిలోగి దిగుతున్న రోజా స్టార్ కంపెయినర్ అయినప్పటికీ ఆమె తన నియోజకవర్గానికే ఎక్కువ శాతం పరిమితం కానున్నారు. గతంలో రెండుసార్లు ఓడిపోయిన ఆమె ఈసారి గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.

చిరంజీవి

చిరంజీవి

సీమాంధ్ర కాంగ్రెస్ తరఫున చిరంజీవి స్టార్ క్యాంపెయినర్‌గా ఉండగా.. ఆ పార్టీ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు ప్రచారం చేయనున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కాగా.. ఆ పార్టీ నేతలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి ప్రచారకర్తలు.

అజహరుద్దీన్

అజహరుద్దీన్

రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ తరపున ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు అజహరుద్దీన్ ప్రచారం చేయనున్నారు.

నగ్మా

నగ్మా

రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ తరపున ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు అజహరుద్దీన్ ప్రచారం చేయనున్నారు. నగ్మా కూడా ప్రచారం చేస్తారు.

పొన్నాల వైశాలి

పొన్నాల వైశాలి

తెలంగాణలో కాంగ్రెసు పార్టీ తరఫున పొన్నాల లక్ష్మయ్య తదితరులతో పాటు పొన్నాల కోడలు పొన్నాల వైశాలి కూడా ప్రచారకర్తగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+