ప్రత్యేక హోదా, సెక్షన్ 8: పవన్ కళ్యాణ్‌పై టిడిపి పోరు

హైదరాబాద్: సెక్షన్ 8, ప్రత్యేక హోదా విషయాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పోరాటం చేయడానికి సిద్ధమైనట్లు భావిస్తున్నారు. హైదరాబాదులో సెక్షన్ 8ను అమలు చేయాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో టిడిపి పార్లమెంటు సభ్యులు చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని అంటూ వారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేశినేని నాని, నిమ్మల కిష్టప్ప వంటి పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించినప్పటికీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సూచనతో వెనక్కి తగ్గారు. అయితే, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టే విషయంలో మాత్రం వెనక్కి తగ్గకూడదనేది చంద్రబాబు భావనగా చెబుతున్నారు. ఈ పోరాటాన్ని దూకుడుగా కాకుండా నెమ్మదిగా సాగించాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ ఏడాది చివరలో హైదరాబాదు మహనగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికలు జరగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను దృష్టిపెట్టుకుని సెక్షన్ 8పై పోరాటాన్ని క్రమంగా పెంచుతూ ఎన్నికల నాటికి ఉధృతం చేయాలని టిడిపి భావిస్తోంది. సెక్షన్ 8పై టిడిపి ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలుల్లో బహిరంగ సభలు నిర్వహించింది. ఇటువంటి సమావేశాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ నిర్వహించి, ఆ తర్వాత హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని టిడిపి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

 TDP to fight against Pawan Kalyan on section 8

హైదరాబాదులోని సెటిలర్లను ఆకట్టుకోవడానికి ఈ ప్రక్రియ పనికి వస్తుందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాదులోని సెటిలర్ల భద్రతను ముందుకు తెస్తూ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పాగా వేసే ఆలోచనలో టిడిపి ఉన్నట్లు చెబుతున్నారు.

తమ పోరాటంలో భాగంగా సమావేశాలను మాత్రమే కాకుండా సదస్సులను, చర్చా గోష్టులను, సంతకాల సేకరణను చేపట్టి ప్రజాభిప్రాయాన్ని సెక్షన్ 8ను అమలు చేయాలనే దిశగా కూడగట్టుకునే ఆలోచనలో టిడిపి ఉన్నట్లు చెబుతున్నారు. సెక్షన్ 8ను అమలు చేయాలని మాత్రమే టిడిపి ఉద్యమాన్ని చేపట్టే అవకాశం ఉంది. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే డిమాండ్ పెట్టుకూడదని కూడా భావిస్తోంది. మరో తొమ్మిదేళ్ల పాటు హైదరాబాదులోని తెలంగాణేతరులకు రక్షణ ఉండాలంటే సెక్షన్ 8ను అమలు చేయాల్సిందేననే దిశగా ఉద్యమం సాగుతుందని అంటున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ వాదలను తిప్పికొట్టే ఆలోచనలో టిడిపి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+