హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచినీటి నదిగా మూసీ, కొరియా సాయం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం... దక్షిణ కొరియా సహకారం కోరనుంది. ఈ విషయాన్ని మంత్రి కెటి రామారావు తెలిపారు. మూసీ నది ప్రక్షాళన కోసం కొంత నిధుల కోసం దక్షిణ కొరియాలోని గ్రీన్‌ క్లైమేట్‌ ఫండ్‌(జిసిపి) అనే సంస్థను నాబార్డు సహాయంతో సంప్రదించనున్నామని వివరించారు.

ఈ లోపులో ప్రయోగాత్మకంగా నది ఎగువ ప్రాంతంలో, ఒకటి-రెండు కిలోమీటర్ల పొడువునా మూసీనదిని సుందరీకరణ చేయబోతున్నామన్నారు. రెండువైపులా రోడ్లు వేయడంతోపాటు పచ్చదనాన్ని పెంచి పర్యాటక ప్రాంతంగా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు.

మూసీనది ప్రక్షాళనలో భాగంగా.. నదిపై తూర్పు-పశ్చిమ కారిడార్‌‌లో ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించటంతో పాటు నది వెంట సుందరీకరణకూ యోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మూసీ పరివాహక ప్రాంతంలో కెటిఆర్ అధికారులతో విస్తృతంగా పర్యటించారు. సమీక్ష నిర్వహించి అప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మూసీ ప్రక్షాళన కోసం..

మూసీ ప్రక్షాళన కోసం..

హైదరాబాద్ పరిధిలో 30 కి.మీ. మేర మూసీనదీ ప్రక్షాళనకు నిర్ణయించినట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇందులో భాగంగా నాలాల నుంచి మురుగు నేరుగా నదిలో చేరకుండా... రూ.3వేల కోట్లతో మరో 10 మురుగుశుద్ధి కేంద్రాలను నెలకొల్పుతామన్నారు.

మూసీ ప్రక్షాళన కోసం..

మూసీ ప్రక్షాళన కోసం..

ప్రస్తుతం రాజధానిలోని 51 నాలాల నుంచి నిత్యం 1250 మిలియన్‌ లీటర్ల మురుగునీరు వస్తుండగా, ఇందులో 93శాతం మురుగు మూసీలో చేరుతోందన్నారు.

మూసీ ప్రక్షాళన కోసం..

మూసీ ప్రక్షాళన కోసం..

ప్రస్తుతం 685 మి.లీ. నీటినే రోజూ శుద్ధిచేసి నదిలోకి వదులుతున్నారన్నారు. మిగిలిన మురుగును కూడా శుద్ధిచేయడానికి, అలాగే మూసీ సుందరీకరణకూ ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు.

మూసీ ప్రక్షాళన కోసం..

మూసీ ప్రక్షాళన కోసం..

ఈ నిధుల కోసం దక్షిణ కొరియాలోని గ్రీన్‌ క్లైమేట్‌ ఫండ్ (జిసిపి) అనే సంస్థను నాబార్డు సహాయంతో సంప్రదించనున్నామని కెటిఆర్ వివరించారు.

మూసీ ప్రక్షాళన కోసం..

మూసీ ప్రక్షాళన కోసం..

ఈ లోపులో ప్రయోగాత్మకంగా నది ఎగువ ప్రాంతంలో, ఒకటి-రెండు కిలోమీటర్ల పొడువునా మూసీనదిని సుందరీకరణ చేయబోతున్నామన్నారు.

మూసీ ప్రక్షాళన కోసం..

మూసీ ప్రక్షాళన కోసం..

రెండువైపులా రోడ్లు వేయడంతోపాటు పచ్చదనాన్ని పెంచి పర్యాటక ప్రాంతంగా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును ఎక్కడ చేపట్టాలన్న దానిపై జిహెచ్‌ఎంసి), హెచ్‌ఎండిఎ), పర్యటన, సాగునీటి శాఖల అధికారులతో కమిటీని వేస్తున్నట్లు తెలిపారు.

మూసీ ప్రక్షాళన కోసం..

మూసీ ప్రక్షాళన కోసం..

నెలరోజుల్లో ఈ నివేదిక వచ్చాక కార్యక్రమం మొదలవుతుందన్నారు. అనంతరం దశలవారీగా ఇలానే మూసీ పరీవాహక ప్రాంతాన్ని ఆహ్లాదకర ప్రాంతంగా మార్చబోతున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

మూసీ ప్రక్షాళన కోసం..

మూసీ ప్రక్షాళన కోసం..

ఉప్పల్‌ భగత్‌ దగ్గర మూసీనదిని సుందరీకరణ పనిని చేపట్టాలని హెచ్‌ఎండిఎను ఆదేశించామన్నారు. మూసీ వెంట దోమలను నిరోధించేవాటితో పాటు సుగంధభరిత మొక్కలనూ పెద్దఎత్తున నాటించబోతున్నట్లు కెటిఆర్ తెలిపారు.

మూసీ ప్రక్షాళన కోసం..

మూసీ ప్రక్షాళన కోసం..

నగర పరిధిలో మూసీ వెంట ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని సీఎం తలపెట్టారని, దీనికి కార్యాచరణను రూపొందించి నిధుల సేకరణకు ప్రయత్నిస్తామని తెలిపారు.

మూసీ ప్రక్షాళన కోసం..

మూసీ ప్రక్షాళన కోసం..

భవిష్యత్తులో మూసీని మంచినీటి నదిగా మార్చడానికి ప్రయత్నాలన్నీ చేస్తున్నామన్నారు. వచ్చే 15న ప్రపంచంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలతో తాను హైదరాబాద్‌లో సమావేశమవుతున్నట్లు చెప్పారు.

 మూసీ ప్రక్షాళన కోసం..

మూసీ ప్రక్షాళన కోసం..

మూసీ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు రాష్ట్రంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు అవసరమైన అధునాతన పద్ధతులపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశం రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

మూసీ ప్రక్షాళన కోసం..

మూసీ ప్రక్షాళన కోసం..

రాజధాని నగరంలో 165 చెరువులను మిషన్‌ కాకతీయ కింద నాబార్డు నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. మెట్రో కోసం స్థలాలిచ్చిన రైతులకు ఉప్పల్‌ భగత్‌లోని హెచ్‌ఎండిఎ లేఅవుట్‌లో త్వరలోనే స్థలాలను ఇవ్వనున్నట్లు తెలిపారు.

English summary
For rejuvenation of the polluted Musi river, the state government will approach the Green Climate Fund (GCF), Incheon, South Korea for a loan of Rs 3,000 crore, minister for municipal administration and urban development KT Rama Rao has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X