తెలంగాణ వార్: కెసిఆర్ వర్సెస్ పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం వేడెక్కింది. మాటల కత్తులు దూసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అదినేత కె. చంద్రశేఖర రావు మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది.తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుపై పవన్ కళ్యాణ్ శనివారంనాడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.. ప్రధానమంత్రి అభ్యర్ది అయిన బిసీ నేత నరేంద్రమోడీని ఏమన్నా అంటే తాట తీస్తానంటూ హెచ్చరించారు. దాంతో కెసిఆర్ రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
వాడెవడు అంటూ కెసిఆర్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. వాడెవడో సినిమా యాక్టర్ అంట, తెలంగాణా నడిబొడ్డులో మాట్లాడుతూ నా తాట తీస్తానని హెచ్చరించాడు కెసిఆర్ అని అన్నారు. వాడెవడు అంటూ పవన్ పేరు ఎత్తకుండా ఎవరనేది వేదికపై పక్కనే ఉన్న వారితోనే పవన్ కల్యాణ్ అని చెప్పించారు. తాను చిటికేస్తే వాడు వెయ్యి ముక్కలైపోతాడని, తాను వీధిలో వెళుతుంటే పది కుక్కలు మొరుగుతుంటాయని వ్యంగ్యంగా అన్నారు.

తనను చూసి ఎన్నో కుక్కలు మొరుగుతుంటాయంటూనే అందులో వీడొకడు అన్నారు. వరంగల్ నడిబొడ్డున వచ్చి తన గురించి మాట్లాడాడని అంటూనే ఇదే ఆంధ్రోళ్ల అహంకారమంటే అని అన్నారు. తన గురించి అంటే పట్టించుకునే వాణ్ణి కాదని, అయితే తెలంగాణా ప్రజలందరినీ ఇపుడే ఇలా అంటూంటే, ఇక అధికారంలోకి వస్తే మన తలపైకెక్కి సవారి చేస్తాడని కూడా కెసిఆర్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల అనంతరం టిడిపి ఖాళీ అయిపోతుందని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సమాధానం ఇస్తూ - ఖాళీ అయిపోవటానికి తమ పార్టీ బ్రాందీ సీసా కాదంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కెసిఆర్ మధ్య కుడా ఇటువంటి విమర్శలే రేగుతున్నాయి.












Click it and Unblock the Notifications