జగన్ డైలమా: పరివారమంతా ఎన్నికల్లోనా..

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన కుటుంబానికి చెందినవారిని ఎవరెవరిని పోటీకి దించుతారనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. తల్లి వైయస్ విజయమ్మ, సోదరి షర్మిల, బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

తన కుటుంబ సభ్యులందరినీ ఎన్నికల్లో పోటీ చేయించాలా, వద్దా అనే విషయాన్ని జగన్ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. వైయస్ జగన్ మాత్రం పులివెందుల అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేయనున్నారు. అన్న కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి కడప లోక్‌సభ టిక్కెట్ ఇచ్చారు. తల్లి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సోదరి షర్మిల కూడా ఎన్నికల బరిలోకి దిగడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. కాని కుటుంబ పరివారం అంతా ఎన్నికల్లో పాల్గొంటే, పార్టీ ప్రచార బాధ్యతలు, పర్యవేక్షణ దెబ్బతింటుందని పార్టీలో తలపండిన నేతలు జగన్‌కు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

YS Jagan

జగన్ తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని ఒంగోలు లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయించే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి కడప జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ సీటు ఇస్తే చాలని అడుగుతున్నారు. వీళ్లంతా జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీని కాపాడడానికి అహర్నిశలూ శ్రమించినవారే.

షర్మిలకు విశాఖపట్నం లోక్‌సభ సీటు ఇవ్వాలని వత్తిడి వస్తోంది. అలాగే విజయలక్ష్మికి నంద్యాల అసెంబ్లీ లేదా తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి అసెంబ్లీ సీటు లేద అనంతపురం జిల్లా తాడిపత్రి సీటు కేటాయించాలనే చర్చ ఉంది. కోస్తాంధ్రలో షర్మిల లేదా విజయమ్మను పోటీ చేయించడం ద్వారా తాము అన్ని ప్రాంతాలకు చెందిన వారమని, అలాగే పార్టీని బలోపేతం చేసేందుకు వీలవుతుందనే కొంత మంది నేతలు జగన్‌కు సూచిస్తున్నారు. అనపర్తిలో జగన్ సామాజికవర్గంకు చెందిన వారే అధికంగా ఉన్నారు. దానికి తోడు వైఎస్‌ఆర్ అభిమానుల కోట. విజయమ్మ చేత అక్కడి నుంచి పోటీ చేయిస్తే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పార్టీకి ఊపు వస్తుందంటున్నారు.

జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. షర్మిలను విశాఖ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే విశాఖ నుంచి షర్మిల, అనపర్తి లేదా నంద్యాల నుంచి విజయమ్మ, ఒంగోలు నుంచి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, కడప నుంచి అవినాష్ రెడ్డి, మరో అసెంబ్లీ సీటు నుంచి రవీంద్రనాథ్ రెడ్డి, పులివెందుల నుంచి పార్టీ అధ్యక్షులు జగన్ పోటీ చేస్తే పరివారమంతా ఎన్నికల్లో ఉన్నట్లవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+