దగ్గరగా..దూరంగా..: బాబులా జగన్ హడావుడి!

 YS Jagan plans of third front
ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతితో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీ నేతలను కలుస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యత కోసం ఆయన తన ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సమైక్యతతో పాటు 2014 ఎన్నికల కోసం కొత్త ఫ్రంట్ ఏర్పాట్ల ప్రయత్నాల్లో కూడా ఆయన ఉంటున్నారని చెబుతున్నారు. ఐదు రోజుల క్రితం జగన్ కోల్‌కతాలో పర్యటించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీని కలుసుకున్నారు.

అక్కడి నుండి ఉత్తర ప్రదేశ్ వెళ్లి ములాయం సింగ్ యాదవ్‌ను కలుద్దామనుకున్నప్పటికీ కలవకుండానే హైదరాబాదుకు తిరిగి వచ్చారు. అంతకుముందు జగన్ తొలుత ఢిల్లీ వెళ్లి సిపిఐ, సిపిఎం, బిజెపి నాయకులను కలిశారు. శనివారం ఆయన జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను కలుసుకున్నారు. ముంబై, భువనేశ్వర్, చెన్నైలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతిని కోరారు. మమత బెనర్జీ, ములాయం సింగ్ వంటి నేతలు మొదటి నుండి రాష్ట్రాల విభజనకు వ్యతిరేకంగా ఉన్నారు. తమవైఖరి ఇప్పటికే వారు చెప్పినందున మళ్లీ వారినే జగన్ ఎందుకు కలుస్తున్నారని టిడిపి ప్రశ్నిస్తోంది.

అయితే, జగన్ సమైక్యం కోసం మద్దతు కూడగట్టడంతో పాటు వచ్చే ఎన్నికల కోసం కొత్త ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నంలో భాగంగానే సమైక్యం పేరుతో నేతలను కలుస్తుండవచ్చునని చెబుతున్నారు. థర్డ్ ఫ్రంట్ పేరుతో గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వివిధ పార్టీల నాయకులను కలిసేవారు. ఇప్పుడు బాబు స్థానంలో జగన్ ఆ పాత్ర పోషిస్తున్నారంటున్నారు. థర్డ్ ఫ్రంట్‌లో గతంలో కీలక పాత్ర వహించిన నాయకులు, ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్న నాయకులు బాబును దూరంగా ఉంచడమో, టిడిపియే దూరంగా ఉండటమో జరిగింది.

ఆ నాయకులకు ఇప్పుడు జగన్ చేరువ అవుతున్నారు. గత రెండు నెలల నుంచి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు బిజెపికి చేరువ అవుతున్నట్టు పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నారు. అదే సమయంలో థర్డ్ ఫ్రంట్‌కు దూరమవుతున్నారు. ఐదు నెలల క్రితం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా బాబు పేరు ఏదైనా కావచ్చు కానీ థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుందని, దానిలో టిడిపి కీలక పాత్ర వహిస్తుందని చెప్పుకొచ్చారు. రెండు నెలల నుంచి బాబు థర్డ్ ఫ్రంట్ ఊసెత్తడం లేదు, అదే సమయంలో థర్డ్ ఫ్రంట్ నాయకులు సైతం చంద్రబాబుతో చర్చించడం లేదు.

గతంలో ములాయం, మమతా బెనర్జీ, మాయావతి, శరద్ యాదవ్‌లు బాబుతో సన్నిహితంగా ఉండేవారు. ఈ నాయకులందరినీ జగన్ కలుస్తూ వారికి చేరువ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి మమతా బెనర్జీ జగన్ జైలులో ఉన్నప్పుడు విజయమ్మతో మాట్లాడారు.

అనంతరం జగన్ ఆమెతో చర్చలు జరిపారు. సమైక్యాంధ్ర సాధన కోసం మద్దతు కూడగట్టడానికి పర్యటనలు అని జగన్ చెబుతున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల తరువాత ఏర్పడే కొత్త కూటమిని దృష్టిలో పెట్టుకొని జగన్ ఇప్పటి నుంచే వివిధ పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఫ్రంట్ పేరుతో జగన్ హడావుడి చేయడంపై టిడిపి దృష్టి సారించిందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+