హైద‌రాబాద్ న‌డిరోడ్డుపై ఓ ప్రేమ‌జంట రోమాన్స్‌..

ఇటీవ‌ల కాలంలో కొన్ని ప్రేమ‌జంట‌లు తెగ రెచ్చిపోతున్నాయి. సినిమాల ప్ర‌భావ‌మో మ‌రేమిటో తెలీదు గానీ ప్రేమ జంట‌ల వికృత‌చేష్ట‌లు ప‌రాకాష్ట‌కు చేరిపోతున్నాయి. తాము ప‌బ్లిక్‌లో ఉన్నాము అన్న స్పృహ కూడా వారికి ఉండ‌డం లేదు. అంత‌గా వారి ప్ర‌వ‌ర్త‌న ఉంటుంది. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్ప‌డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా హైద‌రాబాద్ న‌డిరోడ్డుపై ఓ ప్రేమ‌జంట రోమాన్స్ వీడియో ఇప్ప‌డు నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. అర్ధరాత్రి ఓ జంట కారు సన్ రూఫ్ నుంచి పైకి వచ్చి రొమాన్స్ చేసుకోవ‌డం మొదలు పెట్టారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్స్ ఇదేం ప‌నిరా బాబు.. అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

న‌డిరోడ్డుపై ఇలా చేయ‌డం ఏంటి : అయితే, ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని పీవీ నరసింహరావు ఫ్లై ఓవర్‌పై జ‌రిగింది. ఈ తతంగాన్నంతా వెనుక వస్తున్న కొంద‌రు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేసి చర్యలు వారిపై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా కోరారు. కారు సన్ రూఫ్ నుంచి పైకి వచ్చి రొమాన్స్ చేసిన జంట కాస్తా ఇప్ప‌డు నెట్టింట వైరల్ అవుతోంది. జంట తీరుపై కొంద‌రు నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. నడిరోడ్డుపై ఇలా చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 A love couples romance on the road of Hyderabad.

పాట్నాలో కూడా ఇదే త‌ర‌హా : పాట్నా నడిరోడ్డుపై ఓ జంట ఇదే త‌ర‌హాలో రొమాన్స్ చేసిన వీడియో అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. రాత్రి వేళ ప్రియుడు వేగంగా బైక్‌ నడుపుతుండగా వెనక కూర్చున్న యువతి ఒక్కసారిగా లేచి నిలబడి తన రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని గాల్లోకి చూపించింది. ప్రియుడికి ముద్దు పెట్టింది. ఈ తతంగాన్ని ఆ పక్కనే వస్తున్న బైకర్స్ వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ వీడియోపై పాట్నా ఎస్పీ వైభవ్‌ శర్మ దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. దేశంలోని ప్ర‌తి చోట్లా ఇలాంటి సంఘ‌ట‌న‌లు నిత్యం మ‌న‌కు తార‌స‌ప‌డుతూనే ఉన్నాయి. ఇలాంటి చ‌ర్య‌ల‌పై పోలీసులు క‌ఠిన శిక్ష‌లు అమ‌లుచేస్తూ ఇవి పునరావృత్తం కావ‌ని కొంద‌రు నెటిజ‌న్లు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+