సామాన్యుల‌కు షాక్‌.. కొండెక్కిన కోడి గుడ్డు ధ‌ర‌లు..

సామాన్యుల‌కు షాకింగ్ న్యూస్‌..కోడి గుడ్డు ధ‌ర‌లు కొండెక్కాయి. దీంతో సామాన్యులు సైతం ఏం కొనాల‌న్న ఆలోచించాల్సిన ప‌రిస్థితి దాపురించింది. ఓ పక్క మార్కెట్లో కూరగాయలు ధరలు మండిపోతుంటే మ‌రో ప‌క్క కోడి గుడ్ల ధరలు సైతం సామాన్యుల‌కు చుక్కులు చూపిస్తున్నాయి. కోడిగుడ్డులో చాలా పోష‌కాలుంటాయి. కాబ‌ట్టి చాలామంది కోడిగుడ్లు తినేందుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు. అలాంటిది ఇప్ప‌డు కోడి గుడ్డు ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యుల‌కు కొనాలంటేనే ఆలోచిస్తున్నారు.

ఏప్రిల్ మాసంలో కోడి గుడ్డు ధ‌ర‌లు రూ.4 నుండి రూ.4.50 వరకు ప‌లికాయి. అదే మే నెలలో అయితే వీటి ధ‌ర‌లు రూ.5, 5.50కు చేరాయి. జూన్‌, జూలై మాసాల్లో అయితే కోడిగుడ్డు ధ‌ర‌లు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే కోడి గుడ్డు ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. ఇప్ప‌డు వీటి ధ‌ర రూ.6.00, రూ.6.50కు చేరుకోవడంతో వినియోగదారులు గ‌గ్గొలు పెడుతున్నారు.

A shock to the common man Prices of chicken eggs have gone up

మరోవైపు మారుమూల పల్లెల్లో అయితే కోడి గుడ్లు ధ‌ర‌లు రూ.7.50 వరకు ఉన్న‌ట్లు పలువ‌రు గ్రామ‌స్తులు వాపోతున్నారు. ఎంతో కాలంగా చికెన్‌, మటన్‌ ధరలు విప‌రీతంగా పెర‌గడంతో పలువురు నాన్‌వెజ్ ప్రియులు కోడి గుడ్లతో సరిపెట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కోడి గుడ్ల ధరలు కూడా ఒక్క‌సారిగా కొండెక్కి కూర్చొవడంతో సామాన్యుల‌కు ఏం చేయాలో తెలీడం లేదు.

ఉత్పత్తి త‌గ్గ‌డంతో...

బ‌హిరంగ మార్కెట్లో కోడి గుడ్ల వాడకం విప‌రీతంగా పెరిగింది. సాయంత్రం అయితే చాలు మార్కెట్ల‌లోని ఫాస్ట్ పుడ్ సెంట‌ర్ల‌లో ఆమ్లెట్లు, న్యూడిల్స్ వంటి కోడి గుడ్ల వినియోగం బాగా ఉంది. అయితే, వినియోగానికి తగినంత ఉత్పత్తి లేక‌పోవ‌డంతోనే కోడి గుడ్ల ధ‌ర‌లు సామాన్యుల‌కు చుక్కులు చూపిస్తున్నాయి వ్యాపార వర్గాలు అంటున్నాయి.

ఇక‌, రాష్ట్రంలోని క‌ర్నూలు జిల్లాలో ప్రతి రోజూ లక్షకు పైగా కోడి గుడ్ల ఉప‌యోగం జరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ జిల్లాకు అత్యధికంగా మహబూబ్‌నగర్‌, హైదరాబాద్, బెంగళూరు నుంచి కోడి గుడ్లు దిగుమతి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సీజ‌న‌ల్‌లో గుడ్ల ధరలు త‌గ్గు ముఖం ప‌ట్టే అవకాశం ఉన్నట్లు వ్యాపార వ‌ర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+