విడాకులపై సంచ‌లన వ్యాఖ్య‌లు చేసిన అలహాబాద్ హైకోర్టు ...

సంప్రదాయాలు, ఆచారాలను పాటించి వివాహం జ‌రుపుకోక‌పోయినా, లేదా నిర్వహించకపోయినా అది పెళ్లి అని ప‌రిగ‌ణించ‌లేమ‌ని ఇంత‌కుముందే అల‌హాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, తాజాగా అల‌హాబాద్ హైకోర్టు విడాకుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది విడిపోవాలి అనుకున్న వాళ్లను బలవంతంగా కలపడం క్రూరత్వమే అనిపించుకుంటుందని తేల్చిచేప్పేసింది అల‌హాబాద్ హైకోర్టు. అయితే, తాజాగా ఓ వ్య‌క్తి తనకు, భార్యకి విడాకులు కావాలంటూ కోర్టుని ఆశ్రయించాడు. అయితే దానికి దిగువ కోర్టు అంగీక‌రించ‌లేదు. దీనిపై హైకోర్టుకి వెళ్లాడు ఆ పిటిషనర్. ఈ పిటిషన్ విచారణ సమయంలోనే అలహాబాద్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

దాదాపు ప‌దేళ్ల నుంచి విడిగా ఉంటున్నాం : 2019 నవంబర్ 7వ తేదీన ఘజియాబాద్‌లోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్పీల్ చేసుకున్నాడు ఓ భర్త. అప్పటి నుంచే ఈ కేసు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది. చివరకు ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ని తిరస్కరించాల్సి వ‌చ్చింది. దీనిపై పై కోర్టుకి వెళ్లాడు ఆ పిటిషనర్. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారని, కలిసి ఉండకపోవడానికి ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తున్నారని ఈ సంద‌ర్భంగా వెల్లడించింది కోర్టు. దాదాపు పదేళ్లుగా విడిగా ఉంటున్నారని చెప్పిన న్యాయస్థానం చివరకు వీరిద్ద‌రికి విడాకులను మంజూరు చేసింది. ఇష్టాఇష్టాలేంటో తెలుసుకోకుండా పక్షపాతంగా వ్యవహరించి చట్టపరంగా వాళ్లను కలపాలని చూడడం సరికాదని, వివాహ బంధానికి అర్థమే లేకుండా పోతుందని స్పష్టం చేసింది అల‌హాబాద్ హైకోర్టు..

Allahabad High Court has made some comments on divorce...

ఒక‌రిపై ఒక‌రు క్రిమినల్ కేసులు : ఈ జంట ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. వీరిద్దూ దాదాపు పదేళ్లుగా విడిగా ఉంటున్నారు. విడిగా ఉండడానికి ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవ‌డ‌మే కాకుండా ఒక‌రిపై ఒక‌రు క్రిమినల్ కంప్లెయింట్స్ కూడా ఇచ్చుకున్నారు. చాలా విధాలుగా భ‌ర్త‌ను ఇబ్బంది పెట్టాలని చూసింది భార్య‌. వీరిద్ద‌రిలో ఏ ఒక్క‌రూ కూడా క‌లిసి జీవించేందుకు స‌ముఖ‌త చూప‌డం లేదు. అలాంటప్పుడు వాళ్లను బలవంతంగా కలిపి ఉంచడం చాలా ప్రమాదకరమ‌ని, ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపణలు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+