88ఏళ్ల వయసులో 20 పతకాలు సాధించి..ఔరా అనిపించిన బామ్మ..!
ఎనిమిది పదుల వయసులో 20 పతకాలు గెలుచుకుని ఓ బామ్మ ఔరా! అనిపించింది. బెంగుళూరులోని హావేరికి చెందిన ఓ బామ్మ ఏకంగా 20 పతకాలు గెలుచుకుంది. గమ్యం చేరాలనే తపన ఉండాలే కానీ అందుకు వయసు అవరోధం కాదనీ నిరూపించింది. భవిష్యత్తులో మరిన్నిపోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలను కైవసం చేసుకుంటానని ఆత్మస్థయిర్యంతో చెబుతోన్న సిద్దామతి నెలవిగి. ఈ బామ్మ కథేంటో చూద్దాం పదండి.
145 మంది పోటీలో పాల్గొన్నారు : బెంగుళూరుకు చెందిన సిద్దామతి నెలవిగి వయసు 88 ఏళ్లు. ఈ వయసులో బెంగుళూరులో నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ పోటీలో ఈమె పాల్గొ్న్నారు. ఈ పోటీల్లో పాల్గొనడమే కాకుండా అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ 16 విభాగాల్లో పాల్గొని ఏకంగా 20 పతకాలను కైవసం చేసుకుంది. అందులో క్రీడలు, జానపద గానం, ప్రసంగం, కథలు చెప్పడం, డ్రాయింగ్ వంటి వివిధ ఈవెంట్లలో పాల్గొన్నారు. అందులో ఈ బామ్మ 16 బంగారు పతకాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

అయితే, ప్రతి ఏటా బెంగుళూరులో సీనియర్ సీటిజన్స్ డే సందర్భంగా కొన్ని పోటీలను నిర్వహిస్తారు. ఇందులో అనేక రకాల పోటీలు ఉంటాయి. అయితే ఈ పోటీలో 145 మంది దాకా పాల్గొన్నారు. ఇంతమందిని ఓడించి ఈ బామ్మ ఏకంగా 20 పతకాలను అందుకున్నారు. అయితే ఈ బామ్మ 81-90 సంవత్సరాల విభాగంలో 100 మీటర్ల నడకలో మొదటి స్థానంలో నిలిచింది.
16 విభాగాల్లో : అయితే, ఈ బామ్మ మొత్తం 16 విభాగాల్లో పోటీలో పాల్గొన్నారు. అందులో క్రీడలు, జానపదం గానం, స్పీచ్, స్టోరీ టెల్లింగ్, కథలు, డ్రాయింగ్‌తో పాటు ఇంకా వివిధ విభాగాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా, వంద మీటర్ల నడకను 2 నిమిషాల 30 సెకన్లలో పూర్తిచేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ బామ్మ కేవలం క్రీడల్లో ప్రతిభ చూపడమే కాకుండా, ఒక గొప్ప గాయనిగా కూడా పేరు సంపాదించారు. గత కొన్నేళ్లుగా ఈ సీనియర్ సీటిజన్ పోటీల్లో పాల్గొంటున్నట్లు ఈ బామ్మ తెలిపారు.
మానసిక దృఢత్వమే మిన్న : నేను ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు నడుస్తాను. ఆ వ్యాయమే నా ఈ గెలుపుకు కారణం అంటున్నారు బామ్మ.సీనియర్ సిటిజన్స్ డేని మూడేళ్లపాటు రద్దు చేయవలసి వచ్చినప్పుడు తాను చాలా బాధపడ్డానని ఆమె అన్నారు. కోవిడ్ సమయంలో నేను ఒంటరిగా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నానని చెప్పారు సిద్దామతి. అయితే, ప్రస్తుతం ఈ బామ్మ బెంగుళూరులోని హావేరిలో మనవడు, బావమరిదితో కలిసి ఉంటున్నారు. అయితే ఈమెకు ఒక కొడుకు, ఇద్దరూ కుమార్తెలు ఉన్నారు. వారంతా వేరే చోట స్థిరపడ్డారు.
నేను జీవితంలో ఎప్పుడూ విసుగు చెందను ఎందుకంటే నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి కొన్ని మార్గాలను ఎంచుకున్నాను అని అంటున్నారు బామ్మ. నేను ఏకపాత్రాభినయం చేయగలను. ఇందులో కూడా నేను ఈసారి రాష్ట్ర స్థాయి పోటీలో బహుమతి గెలుచుకున్నాను అని చెబుతున్నారు. గమ్యం చేరుకునేందుకు వయస్సు ఎప్పడూ అడ్డంకి కాదు. అందుకు ముందుగా మనం మానసికంగా దృఢంగా ఉండాలి, మనల్ని మనం ప్రేరేపించుకోగలగాలి అంటున్నారు సిద్దామతి.కొంతమంది వృద్ధులుగా పుడతారు. కానీ వృద్ధులు కాలేరు. అనే సామెతకు నిలువెత్తు నిదర్శనంలా ఉన్నారు ఈ బామ్మ..












Click it and Unblock the Notifications