Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Long weekend : లాంగ్ వీకెండ్‌కు భాగ్య‌నగ‌రంలోని ఈ ప్ర‌దేశాల‌ను చూసేయండి..

మ‌రికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగియ‌బోతుంది. కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌బోతున్నాం. ఈ త‌రుణంలో ఈ వారం క్రిస్మ‌స్ సెల‌వులతో పాటు న్యూయర్ సెల‌వులు కూడా వ‌స్తాయి. రోజువారీ జీవితంలో, తీరిక స‌మ‌యం లేకుండా బిజిగా గ‌డిపిన వారి కోసం ఈ లాంగ్ వీకెండ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి హైద‌ర‌బాద్‌లో ఉండేవారు త‌ప్ప‌కుండా ఈ లాంగ్ వీకెండ్‌లో ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. అలాంటివారి కోసం ఇక్క‌డ సంద‌ర్శించేందుకు చాలా ప్ర‌దేశాలే ఉన్నాయి. ఈ లాంగ్ వీకెండ్‌లో కుటుంబంతో పాటు స్నేహితుల‌తో క‌లిసి సంతోషంగా, ఉత్సాహ‌భ‌రితంగా గ‌డ‌పాల‌నుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతాల‌కు వెళ్లాల్సిందే. రండి ఒక్క‌సారి ఆ ప్ర‌దేశాలేంటో చూద్దాం..

Check out these places in Bhagyanagar for a long weekend..

పాఖల్ సరస్సు: పాఖ‌ల్ స‌ర‌స్సు ఈ లాంగ్ వీకెండ్‌లో సంద‌ర్శించేందుకు ఎంతో అనువైన ప్ర‌దేశం. ఇది హైదరాబాద్ నుంచి దూరం సుమారు 198 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక మానవ నిర్మిత స‌ర‌స్సు. ఈ స‌ర‌స్సు ఒడ్డున కూర్చుని ఇక్క‌డి ప్ర‌కృతి అందాల‌ను వీక్షించొచ్చు. ఇక్క‌డి రాత్రిపూట అట‌వీ ప్రాణుల మ‌ధ్య క్యాంపింగ్ ఎంతో బాగుంటుంది.

ఈ స‌ర‌స్సుకు స‌మీపంలో ఒక వ‌న్య‌ప్రాణుల అభ‌యార‌ణ్యం కూడా ఉంది. ఉద‌యం వేళ ఆ పార్కులోకి వెళ్లి అక్క‌డ ఉన్న జంతువులను, ప‌క్షులను సంద‌ర్శించొచ్చు. ఇది ఒక అడ్వంచ‌ర్ ట్రిప్ వంటిది. ఫ్రెండ్స్‌తో క‌లిసి స‌రాదాగా ఉండాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతానికి వెళ్లాల్సిందే. హైద‌రాబాద్ నుంచి ఈ స‌ర‌స్సును చేరుకునేందుకు సుమారు నాలుగు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

Check out these places in Bhagyanagar for a long weekend..

నాగార్జున సాగర్: ఈ లాంగ్ వీకెండ్‌కు హైద‌ర‌బాద్ స‌మీపంలోని నాగార్జున సాగ‌ర్ ఉత్త‌మ ఎంపిక అని చెప్పుకోవ‌చ్చు. ఈ ట్రిప్‌లో పిల్ల‌ల్నీ కూడా తీసుకెళ్లోచ్చు. ప్ర‌పంచంలోని ఎత్త‌యిన ఆన‌క‌ట్ట‌ల‌లో ఒక‌టైన నాగార్జున సాగ‌ర్ విశిష్ట‌త‌ను పిల్ల‌ల‌కు వివ‌రించొచ్చు. ఈ ఆన‌క‌ట్ట ప్ర‌పంచ‌లోనే అతిపెద్ద కృత్రిమ స‌ర‌స్సు ప్రాంతంగా ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది.

ఈ ఆన‌క‌ట్ట 124 మీట‌ర్ల ఎత్తులో ఉంది. ఇందులో 26 గేట్లు ఉన్నాయి. ఇక్క‌డి త‌వ్వ‌కాల్లో శ‌తాబ్దాల నాటి బౌద్ధ నిర్మాణాలు కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి. ప‌డ‌వ ప్ర‌యాణం చేయాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్ర‌దేశాన్నీ వీక్షించొచ్చు. ఎందుకంటే, ప‌డ‌వ ప్ర‌యాణం ద్వారానే ఈ ఆన‌క‌ట్ట‌ను చేరుకోవ‌చ్చు. ఇది హైద‌ర‌బాద్ నుంచి సుమారు 165 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. హైద‌రాబాద్ నుంచి ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే 3 నుంచి 4 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

Check out these places in Bhagyanagar for a long weekend..

బీద‌ర్‌: ఈ లాంగ్ వీకెండ్‌లో మీ జాబితాలో బీద‌ర్‌ను కూడా చేర్చండి. ఈ ప్ర‌దేశంలోని కోట దేశంలోని అతి పెద్ద కోట‌గా ప్ర‌సిద్ధిచెందింది. ఈ కోట నిర్మాణాలు ప‌ర్షియ‌న్ శైలిని పోలి ఉంటాయి. హైద‌రాబాద్‌కు స‌మీపంలో ఉండే ఈ ప్రాంతం లాంగ్ వీకెండ్‌లో బెస్ట్ ఎంపిక అని చెప్పుకోవ‌చ్చు. ఈ ప్ర‌దేశం హైద‌రాబాద్ నుంచి సుమారు 147 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

బీద‌ర్‌లోని బిద్రి హ‌స్త‌క‌ళ‌ల‌కు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ ప్ర‌దేశం వెండి,ఇత‌ర లోహ మిశ్ర‌మాల‌తో త‌యారు చేసే వ‌స్తువుల‌కు ఎంత‌గానో పేరుగాంచింది. ఇక్క‌డ బ‌హ‌మ‌నీ పాల‌కుల స‌మాధులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప‌ర్యాట‌కుల‌ను విస్మ‌యానికి గురిచేసే చిత్ర‌క‌ళ‌లు కూడా ఉన్నాయి. హైద‌ర‌బాద్ నుంచి ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే సుమారు 3 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+