ప్ర‌వ‌ళికది ఆత్మ‌హ‌త్య కాదు హ‌త్యే... రాహుల్‌గాంధీ ట్వీట్‌..

హైదరాబాద్ లో గ్రూప్ - 2కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిన ప్రవళిక మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్ర‌వ‌ళిక‌ది ఆత్మ‌హ‌త్య కాదు హ‌త్యే అని సంచలన ట్వీట్ చేశారు. ఇది ముమ్మాటికే హత్యే అని ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తుంది. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిల్లాడుతోందని రాహుల్‌గాంధీ అన్నారు.

రాహుల్ గాంధీ స్పంద‌న‌: హైదరాబాద్ లో గ్రూప్ - 2కు ప‌రీక్ష‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని ప్రవళిక మృతి అంశం తీవ్ర వివాదాల‌కు దారి తీస్తోంది. ఉద్యోగాలు రాకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యువతి బలవన్మరణానికి పాల్పడిందంటూ వందలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు దిగిన విష‌యం విదిత‌మే. ఈ అంశంపై రాజకీయంగానూ దుమారం రేగుతుంది. తాజాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఘటనపై స్పందించారు.

congress leader Rahul Gandhi tweets on Pravallika, here is what he said

ఆమెది హత్యే: గ్రూప్ - 2 అభ్యర్థిని ప్రవళికది ఆత్మహత్య కాదని హత్య అని ఆయన ట్వీట్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరమైన విష‌యం. ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికే హత్యే అని ఆయ‌న అన్నారు. తెలంగాణ యువత నేడు నిరుద్యోగంతో విలవిల్లాడుతోంది. గత ప‌దేళ్ల‌లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి తమ అసమర్థతతో రాష్ట్రాన్ని నాశనం చేశాయి. అంటూ రాహుల్‌గాంధీ సోష‌ల్‌మీడియాలో త‌న ఖాతాలో పేర్కొన్నారు.

ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది: వరంగల్ జిల్లా బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి లింగయ్య, విజయ దంపతుల కూతురు ప్రవళిక. ఆమె హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని బృందావన్ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్ 2 ప‌రీక్ష‌ల కోసం ఎన్నో యేళ్ల నుంచి ప్రిపేర్ అవుతుంది. ప్రవళిక శుక్రవారం హాస్ట‌ల్‌లోని తన రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ లెటర్ రాసి హాస్టల్‌లో ప్రవళిక బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఈ వార్త గురించి తెలుసుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చారు. పరీక్షల వాయిదా కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+