రైల్వే ఈ-టికెట్ల బుకింగ్‌పై జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన రైల్వేశాఖ...
గత రెండు మూడు రోజుల నుంచి ఆన్‌లైన్ రైల్వే టిక్కెట్లపై నెట్టింట్లో వస్తున్న ప్రచారంపై రైల్వేశాఖ స్పందించింది. టికెట్లపై వస్తోన్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఐఆర్‌సీటీసీ వ్యక్తిగత ఐడీలో ఇతరులకు టికెట్‌లు బుక్ చేస్తే జైలు శిక్ష, జరిమానా అంటూ సామాజిక మాధ్యమాల్లో విసృతంగా ప్రచారం జరుగుతున్న క్రమంలో రైల్వే శాఖ పలు కీలక ప్రకటన చేసింది. ఐఆర్‌సీటీసీలో వ్యక్తిగత ఖాతాల ద్వారా తమకు కాకుండా బంధువులు, ఫ్రెండ్స్‌కి ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
వీటితో పాటు వేర్వేరు ఇంటిపేర్లు ఉన్నవారికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రైలు టికెట్లు తీసుకోవడంపై కూడా ఆంక్షలు విధించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఐఆర్‌సీటీసీ వ్యక్తిగత యూజర్ ఐడీ ద్వారా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇలా ఎవరికైనా ఈ-టికెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇలా ఒక ఐడీతో నెలకు 12 టికెట్లు వరకూ పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే, ఆధార్ లింక్ చేసుకున్నవారికి ఒక నెలలో 24 టికెట్ల వరకూ బుక్ చేసుకొనే వెసులుబాటు ఉందని తెలిపింది.

ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. అయితే, వ్యక్తిగత ఐడీపై తీసుకున్న టికెట్లను వ్యాపార ప్రాతిపదికన విక్రయించడం మాత్రం రైల్వేచట్టం కింద నేరమేనని ఆ తరహా చర్యలకు పాల్పడిన వారిపై రైల్వే చట్టం -1989లోని సెక్షన్ 143 ప్రకారం నేరంగా పరిగణిస్తారని రైల్వే మంత్రిత్వశాఖ'ఎక్స్' వేదికగా ప్రకటించింది. కేవలం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లకు మాత్రమే థర్డ్‌పార్టీ బుకింగ్ ద్వారా టికెట్లు తీసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపింది. అలాగే, వ్యక్తిగత ఐడీలు ఉన్నవారు ఇంటి పేరుతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల పేరిట అవకాశం మేరకు ఈ-టికెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications