దీపావ‌ళి క్రాక‌ర్స్ బారినుండి పెంపుడు జంతువులను ఎలా కాపాడాలి...

దేశ‌మంతా దీపావ‌ళి సంబ‌రాల్లో మునిగిపోతుంది. ఈ స‌మ‌యంలో అన్ని ప్రాంతాల్లో వెలుగులు వెద‌జ‌ల్లుతుంటాయి. దీపావ‌ళి పండ‌గ అంటేనే క్రాకర్స్.. ప‌టాసులు కాల్చుకోవడం. చిన్న‌పిల్లల‌కు ఈ పండుగ ఎంతో స‌ర‌దాగా ఉంటుంది. ఉద‌యం నుంచి క్రాక‌ర్స్ కాలుస్తూ ఎంత‌గానో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక‌, సాయంత్రంగానే మ‌తాబుల‌తో న‌గ‌ర‌మంతా ద‌ద్ద‌రిల్లుతుంది.

ఈ ప‌టాసుల శ‌బ్దానికి మ‌నుషులే ఉలిక్కిప‌డుతుంటారు. అలాంటి జంతువులు బెద‌ర‌కుండా ఎలా ఉంటాయి చెప్పండి. ఈ బాణ‌సంచా శ‌బ్దాల‌కు కుక్క‌లు ఎంత‌గానో భ‌య‌ప‌డ‌తాయ‌ని కొన్ని అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. కాబ‌ట్టి ఈ క్రాక‌ర్స్ బారి నుండి మీ పెంపుడు జంతువుల‌ను ఎలా కాపాడుకోవాలో అని ఆలోచిస్తున్నారా? అయితే, వీటిని పాటించాల్సిందే..

How to protect pets from Diwali crackers

ఈ స‌మ‌యంలో వీటిని ఇంట్లోనే ఉంచండి: బాణాసంచా శ‌బ్దాల‌కు కుక్క‌లు అనారోగ్యానికి గుర‌వుతాయ‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో మీ పెంపుడు జంతువుల‌ను ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. ఈ ట‌పాకులు శబ్దం నుండి మీ పెట్స్‌ను కాపాడేందుకు ముందుగా వాటిని చెవుల‌ను మూసేయండి. చ‌లికాలంలో మ‌నం ఎలాగైతే చెవులను టోపీ లేదా మ‌ఫ్ల‌ర్‌తో కాపాడుకుంటామో అదే విధంగా ఈ దీపావ‌ళి పెద్ద పెద్ద శ‌బ్దాల‌కు మీ పెట్స్ చెవుల‌ను కూడా అలాగే మూసేయండి. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల అవి ఈ శ‌బ్దాల బారి నుంచి త‌ప్పించుకునే అవ‌కాశం ఉంటుంది. ఇక మీ పెంపుడు జంతువులు ఈ శ‌బ్దాల‌కు భ‌య‌ప‌డవు.

క్రాక‌ర్స్ కాల్చే స‌మ‌యంలో మీ పెంపుడు జంతువుల‌ను ఇంట్లో ఉంచండి. కిటికీలు, ఇంటి త‌లుపుల‌న్నింటిని ముందుగానే మూసి ఉంచండి. ఎటువంటి క్రాక‌ర్స్‌ కాంతి పెంపుడు జంతువులపై ప‌డకుండా జాగ్ర‌త్త‌ప‌డండి. ఇంటి డోర్ క‌ర్ట‌న్‌లు అన్నింటిని మూసి ఉంచండి. వాటి దృష్టి మ‌ర‌ల్చేందుకు టీవి ఆన్ చేసి ఉంచండి. అప్ప‌డు వాటి దృష్టి క్రాక‌ర్స్‌పై కాకుండా టీవిపై ఉంటుంది. పెంపుడు జంతువుల‌కు ప్ర‌త్యేకంగా వాటి నివాసం ఉంటుంది. ఒకవేళ ఈ స‌మ‌యంలో అవి అందులోనే ఉంటే మాత్రం ఆ నివాసాన్ని పూర్తిగా క‌ప్పి ఉంచండి. పెంపుడు జంతువు భ‌య‌ప‌డ‌కుండా ఉండేందుకు మంద‌పాటి దుస్తుల‌తో ఆ నివాసాన్ని కప్పాల్సి ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌టాసుల నుంచి వ‌చ్చే పెద్ద పెద్ద శ‌బ్దాలు ఆ ఇంటిలోపలికి ప్ర‌వేశించ‌వు. దాంతో మీ ఇంట్లో ఉండే పెంపుడు జంతువులు సుర‌క్షితంగా ఉంటాయి.

వెట‌ర్న‌రి వైద్యుల సూచ‌న మేర‌కు మెడిస‌న్‌.: ఈ స‌మ‌యంలో పెంపుడు జంతువులు వాటిని అవి ర‌క్షించుకునేందుకు వాటికి స‌రిపోయే దుస్తుల‌ను ధ‌రించాలి. అవి వాటి శరీరాన్ని కప్పి ఉంచుతాయి. దాంతో అవి వాటిని ర‌క్షించుకోవ‌డమే కాకుండా సుర‌క్షితంగా ఉన్నామ‌నుకుంటాయి. కొన్ని పెంపుడు జంతువులు సాధార‌ణంగా మ‌నుషుల మాదిరిగానే సున్నితంగా ఉంటాయి. కాబ‌ట్టి అటువంటివి ఉంటే మాత్రం వెట‌ర్న‌రీ వైద్యుడుని సంప్ర‌దించ‌డం మంచిది. అటువంటి పెంపుడు జంతువుల‌కు వైద్యుల సూచ‌న‌ల మేర‌కు మెడిస‌న్ ఇస్తారు. వాటిని వేసుకోవ‌డం ద్వారా అవి నిద్ర‌లోకి జారుకుంటాయి. అయితే, ఈ మెడిసన్‌ని వైద్యుల స‌ల‌హాతో మాత్ర‌మే తీసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+