40 రూపాయలు అప్పు చేశాడు.. కొన్నిగంటల్లోనే కోటీశ్వరుడయ్యాడు..
అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. అందుకే, దేనికోసం వేచిచూడకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోతే ఏ రోజుకైనా దాని ప్రతిఫలం దక్కుతుందనేది మరోసారి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కూలీ విషయంలో నిజమైంది. పశ్చిమబెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్‌కు చెందిన దినసరి కూలీ కొన్ని గంటల్లోనే కోటీశ్వరుడయ్యాడు.
కూలీ మేకలకు గడ్డి కోసేందుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి కోటీశ్వరుడనే వార్త తెలిసింది. ఈ వార్త గ్రామమంతా వ్యాపించడంతో అక్కడ సంబరాలు అంబరాన్నంటాయి. ఆ గ్రామస్థులంతా ఆ కూలీకి అభినందనలు తెలిపారు. రండి ఇంతకీ ఆ కూలీ ఎవరో.. అతని గురించి తెలుసుకుందాం.

పశ్చిమబెంగాల్‌లోని మంగల్‌కోట్‌లోని ఖుర్తుబాపూర్ గ్రామానికి చెందినవాడే భాస్కర్ మాజీ. ఈ వ్యక్తి గత పదేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు. ఏదో ఒకరోజు తన కల కచ్చితంగా నెరవేరుతుందన్న ఆశతో..ఎప్పటిలాగే ఆదివారం ఉదయం కూడా తన దగ్గర డబ్బులు లేకపోయినా 40 రూపాయలు అప్పు చేసి మరీ లాటరీ టికెట్ కొన్నాడు. మధ్యాహ్నంలోపు అతను కోటిశ్వరుడయ్యానే వార్త అతనికి తెలిసింది.
దినసరి కూలీ లాటరీలో కోటి బహుమతి గెలుచుకున్నాడు..
ఆదివారం బండ్లకు గడ్డి కోసేందుకు నాపర బస్టాండ్‌కు వచ్చానని కూలీ భాస్కర్ మాజీ తెలిపాడు. అయితే లాటరీ టికెట్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో తనకు తెలిసిన వారి వద్ద 40 రూపాయలు అప్పు తీసుకుని మమేజుల్ భాయ్ లాటరీ కౌంటర్ నుంచి 60 రూపాయలకు 95హెచ్ 83529 టికెట్ కొని పని చేసుకోవడానికి వెళ్లాడని చెప్పాడు. లాటరీలో మొదటి బహుమతి గెలుచుకున్నట్లు తెలిసంది. ఈ విషయం తెలిసిన తర్వాత అతని ఆనందానికి అవధులు లేవు.
ఆదివారం మధ్యాహ్నం 1.20 గంటలకు గ్రామానికి చెందిన భాస్కర్ మాజీ కోటి రూపాయల మొదటి బహుమతిని గెలుచుకున్నట్లు తెలిసిందని లాటరీ టిక్కెట్ విక్రయదారు మౌలిక్ సేఖ్ మమేజుల్ తెలిపారు. గత 10 ఏళ్లుగా ఈ ప్రాంతంలో లాటరీ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నానని, ఓ నిరుపేద కూలీ తన దుకాణంలో కొన్న లాటరీ టిక్కెట్‌తో కోటీశ్వరుడయ్యాడని సంతోషం వ్యక్తం చేశాడు లాటరీ టిక్కెట్ విక్రయదారుడు.

ఆ డబ్బుతో కూతుళ్ల పెళ్లికి తీసుకున్న అప్పు తీర్చేస్తా..
కోటి రూపాయలు లాటరీ తగిలిన కూలీ భాస్కర్ మాజీ తన ఇల్లు మట్టితో తయారైందని, వర్షాకాలంలో నీరు కారుతూ ఉంటుందని, ఇబ్బందిగా ఉంటుందని ఈ వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టి కూతుళ్ల పెళ్లికి తీసుకున్న అప్పు తీరుస్తానని మీడియాతో చెబుతున్నాడు. వ్యవసాయం కోసం కొంత భూమిని కూడా కొనుగోలు చేస్తానని అన్నాడు. నాన్న మమ్మల్నిఅతికష్టమ్మీద బీఏ వరకూ చదివించాడు. మా ఇద్దరి అక్కాచెల్లెళ్లకు అప్పు చేసి మరీ పెళ్లి చేశాడు. ఇప్పడు దేవుడు మా మీద కరుణ చూపించాడు అంటూ భాస్కర్ కుమార్తెలు నాన్నగురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications