Metro Train stories:మెట్రోలో ప్రయాణిస్తున్నారా.. అయితే ఈ కథ మీకోసమే..!
హైదరాబాద్: అనగనగా ఒక రాజు... ఆరాజుకు ఏడు మంది కొడుకులు.కథ కంచికి మనం ఇంటికి. ఈ మాటలు అప్పుడెప్పుడో చిన్నప్పుడు విని ఉంటాం. భోజనం తర్వాత ఆరు బయటపడుకుని చందమామ వైపు చూస్తూ ఉండగా అమ్మమ్మనో లేక నాణమ్మనో చక్కటి కథలు చెబుతూ ఉంటే వింటూనే నిద్రలోకి జారుకుంటాం. ఆ రోజులు మళ్లీ తిరిగి రావు. అలాంటి ఫీలింగ్ తిరిగి పొందేందుకు వన్ ఇండియా తెలుగు మంచి కథలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
నిత్యం బిజీగా సాగిపోతున్న ఈ జీవితంలో ఇప్పటికే చాలా కోల్పోయాం. ఒక్కసారి ఇంటి నుంచి కాలు బయటకు పెడితే చాలు ఆఫీసులు, బిజినెస్, టార్గెట్స్ ఇలా బిజీ అయిపోతున్నాం. అయితే మండుటెండల్లో చాలామంది మెట్రో ట్రైన్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ సమయంలో మొబైల్స్‌లో వార్తలు చూస్తూ గేమ్స్ ఆడుతూ వారు దిగాల్సిన స్టేషన్ వచ్చే వరకు టైం పాస్ చేస్తున్నారు. అందుకే మెట్రోలో ప్రయాణించే వారి కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీకోసం అందిస్తున్నాం.

మెట్రో ట్రైన్ స్టోరీస్‌లో భాగంగా ముందుగా కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం.ఈ రోజుల్లో అందరూ కలిసి ఒక కుటుంబంగా జీవించడం అనేది చాలా అరుదుగా చూస్తున్నాం. చిన్న చిన్న విబేధాలతో కుటుంబం ఆ కుటుంబంలోని సభ్యులంతా చెల్లా చెదురు కావడం చూస్తున్నాం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. ఇప్పుడు ఎక్కడా ఆ ఊసే లేదు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవస్థ సాగుతోంది. ఇప్పుడు ఒక కథ చెబుతాను.
అనగనగా రామాపురం అనే ఓకుగ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక కుటుంబం చాలా సంతోషంగా జీవిస్తుండేది. తల్లిదండ్రులతో సహా ఆ ఇంట్లో ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్లు ఉండేవారు. అంతా సాఫీగా ఉన్న సమయంలో ఒకరోజు మొదటి కోడలుకు అత్తకు మధ్య గొడవ జరిగింది.భర్త ఇంటికి రాగానే ఆ భార్య జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఆ కథను విన్న భర్త కన్నెర్ర చేశాడు.

వెంటనే తల్లిదండ్రులను వీడి తన భార్యతో పాటు వేరు కాపురం పెడితే చాలా సంతోషంగా ఉంటామని భావించాడు.అనుకున్నదే తడవుగా వేరు కాపురం పెట్టాడు.దీంతో వారు ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవడం మొదలుపెట్టారు. ఆర్థికం, ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చాయి. వేరు కాపురం పెట్టడంతో ఎవరూ వారికి సహాయం చేసేందుకు ముందుకు రాలేదు.
ఈ ఇబ్బందులు ఎదుర్కొని ఇక తమ వల్ల కాదని గ్రహించి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరి వారు చేసిన తప్పును తెలుసుకుని క్షమించాల్సిందిగా కోరారు. పిల్లలు తప్పుచేసినప్పటికీ క్షమించే గుణం తల్లిదండ్రులకు ఉంటుంది. వారు క్షమించారు. తిరిగి అంతా కలిసి మునపటిలా చాలా సంతోషంగా జీవించారు. ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏంటంటే.. ఉమ్మడి కుటుంబంలో ఉండే జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. వేరు కుంపటితో అన్నీ సమస్యలే ఎదురవుతాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications