పేక‌ముక్క‌ల‌తో గిన్నిస్ రికార్డుకెక్కిన కుర్రాడు...

స‌హ‌జంగా పేక ముక్క‌ల‌తో ఏం చేస్తారు.. పేకాట ఆడుతారు. అప్ప‌ట్లో ఈ పేకాట‌ను గ్రామాల్లో ఊరిచివ‌ర‌న ఆడుకునేవారు. అయితే ఇప్పుడు అది నిషేదం. ఎక్క‌డైనా ఆడుతూ క‌నిపిస్తే ఇక మీ ప‌ని అంతే. జైలు పాల‌వ్వ‌డం కాయం. అయితే, ఈ ఆట‌ను అత్య‌ధికంగా ధ‌నికులే ఆడుతుంటారు. అది కూడా పెద్ద పెద్ద హోట‌ళ్లో ర‌మ్మీ, పోక‌ర్ గేమ్స్ ఇలా ఆడుతూ ఉంటారు. ఏదైనా మ‌నం చూసే కోణాన్ని బ‌ట్టి ఉంటుంది అని అంటున్నాడు ఓ కుర్రాడు. పేక‌ముక్క‌ల‌ను కూడా మంచిగా ఉప‌యోగించ‌వ‌చ్చిన నిరూపించాడు. పేక‌ముక్క‌ల‌తో ఒక అద్భుతాన్ని సృష్టించాడు. పేక‌ముక్క‌ల‌తో ఏకంగా ఓ ప్యాలెస్‌ను నిర్మించి గిన్నిస్ రికార్డుకెక్కాడు. రండి ఆ కుర్రాడెవ‌రో తెలుసుకుందాం.

ప‌దిహేనేళ్ల కుర్రాడి... వినూత్న ఆలోచ‌న‌..

ఆ అబ్బాయి వ‌య‌సు 15ఏళ్లు.. ఆ వ‌య‌సులో కుర్రాళ్లు సినిమాలు, షికార్లు, స్నేహితుల‌తో క‌బుర్లు ఇలాంటివి చేస్తుంటారు చాలామంది. కానీ ఈ అబ్బాయి మాత్రం త‌న‌లో ఉన్న క్రియెటివీటిని ప్ర‌పంచం ముందు పెట్టాడు. ఫ‌లితంగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ అబ్బాయి పేరు అర్నవ్. కోల్‌క‌త్తాకు చెందిన ఈ అబ్బాయి పేక‌ముక్క‌ల‌తో ఒక ప్యాలెస్‌ను నిర్మించాడు.

The boy who holds the Guinness record with dice...

ఆ ప్యాలెస్ సుమారుగా 11 అడుగుల ఎత్తు 16అంగుళాల వెడల్పు కలిగి ఉంటుంది. ఆ ప్యాలెస్ పొడవు 40 అడుగులు. ఇంత‌కుముందే ఈ పేక‌ముక్క‌ల‌తో అనేక ర‌కాల ప్ర‌యోగాలు చేశాడు. ఎన్నోభ‌వ‌నాల‌ను కూడా నిర్మించాడు. ప్ర‌తి ఒక్క నిర్మాణానికి ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది అదే అర్న‌వ్ స్పెషాలిటి. అయితే, ఈసారి ఈ ప్యాలెస్‌ను నిర్మించ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని చెబుతున్నాడు ఆర్న‌వ్‌. సుమారు 41 గంట‌ల‌పాటు శ్ర‌మించి ఈ ప్యాలెస్‌ను నిర్మించాడట‌.

చిన్న‌తనం నుంచే అల‌వాటు..
అర్నవ్ ప్ర‌స్తుతం ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. పేక‌ముక్క‌ల‌తో మేడ‌లు క‌ట్ట‌డం చాలా సుల‌భ‌మ‌ని అనుకుంటారు అంద‌రూ. కానీ అది చాలా క‌ష్ట‌మ‌ని అంటున్నాడు అర్న‌వ్‌. చిన్న‌ప్ప‌టి నుంచే త‌న‌కు ఇలా పేక‌ముక్క‌ల‌తో చిన్న చిన్న మేడ‌లు క‌ట్ట‌డం అల‌వాట‌ని, అలా ఆ ఇష్టం కాస్తా త‌న హాబీగా మారింద‌ని అంటున్నాడు అర్న‌వ్‌. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆ హాబీనే కాస్త సీరియ‌స్‌గా తీసుకుని గంట‌ల త‌ర‌బ‌డి ప్రాక్టీసు చేసేవాడ‌న‌ని చెబుతున్నాడు. అలా పేక‌ముక్క‌ల‌తో నిర్మాణాలు త‌యారుచేసి రికార్డులు సొంతం చేసుకోవ‌డం ఒక అల‌వాటుగా మారిందంటున్నాడు అర్న‌వ్‌.

మూడు మ‌కావు హోట‌ళ్ల ప్ర‌తిరూపాలు..
అయితే, ప్యాలెస్ కాకుండా అనేక రూపాల‌ను కూడా నిర్మించాడు. పొడవు 34 అడుగుల 1 అంగుళం, 9 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 11 అడుగుల 7 అంగుళాల వెడల్పుగ‌ల పేక‌ముక్క‌ల‌తో ఏకంగా మూడు మ‌కావు హోట‌ళ్ల ప్ర‌తిరూపాల‌ను సృష్టించాడు. తాజాగా అర్న‌వ్ నిర్మించిన భ‌వ‌న నిర్మాణానికి గిన్నిస్ రికార్డు సొంతమ‌యింది.

అయితే, ఈ గిన్నిస్ రికార్డు అంత త్వ‌ర‌గా రాలేద‌ని అంటున్నాడు అర్న‌వ్‌. గ‌తంలో గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించానని, అందులో భాగంగానే పేకముక్కలతో ఉన్న రికార్డుల గురించి ఇంటర్ నెట్‌లో శోధించాన‌ని చెప్పాడు. తన సాధన వ‌ల్లే నేడు గిన్నిస్ రికార్డు సొంత‌మ‌య్యింద‌ని తెలిపాడు. ఈ రికార్డు కోసం గ‌త సంవ‌త్స‌రం ప్ర‌య‌త్నించాన‌ని, కానీ విజ‌యం వ‌రించ‌లేద‌ని తెలిపాడు. అంత‌టితో ఆగ‌కుండా మ‌ళ్లీ ప్ర‌య‌త్నించాన‌ని ఈసారి తాను అనుకున్న‌ది సాధించ‌గ‌లిగాన‌ని అంటున్నాడు అర్న‌వ్‌. ఏదీ ఏమైనా ఈ అబ్బాయి క్రియేటివీటికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+