క్యాబ్ క్యాన్సిల్ చేసిందని మహిళను వేధించిన క్యాబ్ డ్రైవర్...
ప్రస్తుతం సమాజంలో నిత్యం మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. బయటా నిత్యం ఏదో ఒకచోట వేధింపులకు గురవుతూనే ఉన్నారు మహిళలు చట్టాలు కఠినంగా ఉన్నా మహిళలపై నేరాలు మాత్రం తగ్గడం లేదు. మహిళలను వేధించేందుకు కొంతమందికి అసలు కారణాలే ఉండడం లేదు. చిన్న చిన్న కారణాలతోటి మహిళలు వాళ్లేం చేయగలరన్న ధైర్యంతో వేధింపులకు గురిచేస్తున్నారను. తాజాగా బెంగుళూరులో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ మహిళ క్యాబ్ బుక్ చేసి ఆ తర్వాత వెంటనే ఆ రైడ్‌ను క్యాన్సిల్ చేసింది. అయితే, క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేసిందనే నెపంతో ఆ క్యాబ్ డ్రైవర్ ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే..
న్యూడ్ ఫోటోలు పంపాడు : బెంగళూరు నగరానికి చెందిన సదరు ఓ మహిళ తన ఆరేళ్ల కుమార్తె ను స్కూల్ నుంచి తీసుకొని రావడానికి వెళ్లింది. చేతిలో తొమ్మిది మాసాల బాబు కూడా ఉన్నాడు. తీరా పాఠశాలకి వెళ్లిన తర్వాత ఆ పాప నడుచుకుంటూ ఇంటికి రావడానికి నిరాకరించింది. దీంతో ఆ మహిళ వెంటనే క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్ బుక్ అయ్యింది కానీ, రావడానికి కాస్త సమయం పట్టింది. ఈ లోపు పిల్లలు ఏడుపు మొదలుపెట్టారు. ఏంతసేపటికి క్యాబ్ రాకపోయేసరికి ఏం చేయాలో తెలీక ఆ మహిళ ఆటో మాట్లాడుకుని వెళ్లిపోయింది.

క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేసింది. బుక్ చేసిన తర్వాత క్యాబ్ క్యాన్సిల్ చేసిందన్న కోపంతో ఆ క్యాబ్ డ్రైవర్ ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఫోన్‌లో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆ మహిళకు న్యూడ్ ఫోటోలు పంపడం మొదలుపెట్టాడు. అసభ్యకరమైన ఫోటోలు, మెసేజ్‌లు పెట్టడం చేశాడు. దాంతో అతని వేధింపులు తట్టుకోలేక, ఆ మహిళ చివరకు బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
క్యాబ్ డ్రైవర్‌ని బెదిరించారు : ఆ మహిళ ఆటోలు ఉండగానే ఆ క్యాబ్ డ్రైవర్ దినేష్ ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె తన పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ, ఆ క్యాబ్ డ్రైవర్ వినిపించుకోలేదు. ఆమెను ఇబ్బంది పెడుతూ, అసభ్యకరమైన ఫోటోలను, మెసేజ్‌లను పంపడం మొదలుపెట్టాడు. దీంతో, ఆ మహిళ ఇంటికి వెళ్లాక అపార్టుమెంట్‌లోని వారికి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పింది. అయితే అపార్టుమెంట్ వాసులు ఆ క్యాబ్ డ్రైవర్‌ని బెదిరించారు. ఆ ఫోటోలను అతను డిలీట్ చేశాడు. ఎప్పటికైనా ఇలాంటి వారితో సమస్యే నని భావించినా ఆ మహిళ తన దగ్గరున్న కొన్ని ఫోటోలను తీసుకుని దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు క్యాబ్ డ్రైవర్ దినేష్‌పై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications