Viral Video: బైక్‌పై వెళుతూనే లవర్స్ లిప్‌లాక్.. ఫైర్ అవుతోన్న నెటిజన్లు!
ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఏం చేసినా దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలి... తక్కువ సమయంలోనే ఫేమస్ అయిపోవాలి. ఇది చాలామంది యువతలో ఉన్న తాపత్రయం. అయితే, అందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు.
కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే.. మరికొందరు తామ మనుషులం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. చుట్టుపక్కల వారు ఏమనుకుంటారు అనే పట్టింపు లేకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైక్ రన్నింగ్‌లో ఉండగా వీరు చేసిన పనికిమాలిన పనిని చూసిన నెటిజర్‌లు మండిపడుతున్నారు.

నెటిజన్స్ ఆగ్రహం..
ఈ వీడియోకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి బైక్ డ్రైవ్ చేస్తుండగా ఇద్దరు ప్రేమికులు వెనకాల కూర్చొన్నారు. అలా బైక్ రన్నింగ్‌లో ఉండగానే ఒకరికి ఒకరు లిప్ టు లిప్ ముద్దులు పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా.. ఆ ఘనకార్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వారు ఏ ఉద్దేశంలో సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టారో తెలియదు కానీ, దానిని చూసిన నెటిజర్లు మాత్రం తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరి తర్వాత ఏం జరిగిందో అంటూ కొందరు క్యూరియాసిటీతో అడుగుతుంటే.. ఇలాంటి వారి విషయంలో అస్సలు జాలి చూపకూడదు.. వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకోవాలని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడి రోడ్డుపై ఇంతకు బరితెగించిన వీళ్లకు తగిన బుద్ది చెప్పాల్సిందే అంటూ వస్తోన్న ఈ కామెంట్లను చూస్తే.. వీరికి త్వరలోనే మూడిందని అర్థమవుతుంది. మరి ఈ వీడియోపై మీరెంటారు.












Click it and Unblock the Notifications