• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శివారు భూములకు భలే డిమాండ్‌ ప్రవాసాం     లోగుట్టు    శివారుభూములకు భలే డిమాండ్‌ప్రవాసాంధ్రులు,పారిశ్రామిక వేత్తలు

By Staff
|

ప్రవాసాంధ్రులు,పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్‌ నగరంనాలుగు శివార్లలో భారీగా భూములనుకొనుగోలు చేస్తున్నారు. దీనితోబీడు భూములకు కూడా ఎకరానికి లక్షలాదిరూపాయల ధరలు పలుకుతున్నాయి. బ్యాంకులవడ్డీరేటు బాగాతగ్గిపోవడంతో సంపన్నులు భూములపైనే పెట్టుబడులు పెడుతున్నారు.భూముల ధరలు ఒకటి రెండేళ్ళలోనేరెట్టింపు అవుతుండడంతో భూమిఇప్పుడు హాట్‌ ప్రాపర్టీగా మారింది. కరువుతోసతమతమయ్యే పాలమూరురైతులు కూడా ఈ భూముల ధరల వల్లలక్షాధికారులవుతున్నారు.హైదరాబాద్‌- కర్నూలు రోడ్డులోఅరవై, డెబ్బై కిలోమీటర్ల వరకురోడ్డుకు అటూ ఇటూ ఉన్న భూములు ఎకరానికిపదిలక్షల వరకు పలుకుతున్నాయి.జొన్న కూడా పండని పొలాలు ఇలా లక్షలుకురిపిస్తున్నాయి. అయితే నిరక్షరాస్యులైన రైతులు ఆ లక్షలతోఏం చేసుకోవాలో తెలియక తమ భూములను అలాగే ఉంచుకుంటున్నారు.ముంబాయి, విజయవాడ, కరీంనగర్‌రోడ్ల పొడవునా భూములకు డిమాండ్‌ఏర్పడింది.

ఇన్‌ఫర్మేషన్‌కమిషనర్‌ పోస్టులకు పైరవీలు

రాష్ట్రప్రభుత్వం మరో ఇన్‌ఫర్మేషన్‌కమిషనర్‌ పోస్టులను భర్తీ చేయనుందని తెలియడంతోచాలామందిఈ నామినేటేడ్‌ పోస్టుల కోసం ఎగబడుతున్నారు. ఎడిటర్లతో సహాసీనియర్‌ జర్నలిస్టులు, లెక్చరర్లు,లాయర్లు ఈ పదవుల కోసం పైరవీలు ప్రారంభించారు. ఈపోస్టు ఛీఫ్‌ సెక్రటరీ హోదాకు సమానమైనవి కావడం,భత్యాలుకాకుండా జీతమే నెలకు 35,000 కావడం,కారు, డ్రైవరు, బంగళా, ఇంటివద్దఅటెండర్లు ఉండే ఈ పదవి చాలా మందికి డ్రీంగామారింది. వంద మంది ఐఎఎస్‌లలోఒకరికి చీఫ్‌ సెక్రటరీ పదవి వస్తుంది.మిగతా వారంతా ఆలోపే రిటైరైపోతుంటారు. మరి డైరెక్టుగా చీఫ్‌సెక్రటరీ హోదా కలిగిన నామినేటేడ్‌ పోస్టుకుప్రయత్నించకుండా ఎవరుంటారు?కొందరు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసికాంగ్రెస్‌ అధిష్టానవర్గంతోరాజశేఖరరెడ్డికి సిఫార్సు చేయించుకోవాలని ప్రయత్నాలుచేస్తున్నారు.

నగరంలోపూటకూళ్ళమ్మలు!

పూర్వంపూటకూళ్ళమ్మలు ఉండేవారని చందమామకథల్లో చదువుకున్నాం. నగరంలో ఇప్పుడుపూటకూళ్ళమ్మలకు డిమాండ్‌ పెరిగింది.పిల్లలు విదేశాల్లోనో, భారత్‌లోనే మరో నగరంలోనే ఉన్న తలిదండ్రులుఅన్నం వండిపెట్టడానికి పూటకూళ్ళమ్మలనుఆశ్రయిస్తున్నారు. కొన్ని కాలనీల్లో అన్నం,కూరలు వండిపెట్టేవంటలమ్మలు నెలకు పదిహేను వేల రూపాయలకు పైగా సంపాదిస్తున్నారు.రోజుకు నాలుగు ఇళ్ళకి వెళ్ళి అక్కడఅందుబాటులో ఉన్న పదార్ధాలు, కూరగాయలతో వంట చేసిపెట్టడమే వీరిడ్యూటీ. కుకట్‌పల్లి హౌసింగ్‌బోర్డుతదితర కాలనీల్లో రెడీమేడ్‌ కూరలుఅమ్ముతున్నారు. ఇంట్లో అన్నం మాత్రమేవండుకుని కూరలను కొనితెచ్చుకోవడం బ్యాచిలర్సే కాదుసంసారులూ చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X