• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భోజ్‌పురి విప్పిన నగ్మా సినీనటి నగ్మ     లోగుట్టు    భోజ్‌పురివిప్పిన నగ్మాసినీనటినగ్మా ఇప్పుడేం చేస్తోంది?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌నగరంలో వ్యభిచారం మూడుసెల్‌ఫోన్లు ఆరు కండోమ్‌లుగావర్ధిల్లుతోంది. అపార్ట్‌మెంట్‌ కల్చర్‌పెరగడం, సెల్‌ఫోన్స్‌ వంటిసాధనాలు అందుబాటులోకి రావడంతోగుట్టుగా వ్యభిచార కార్యకలాపాలుసాగిపోతున్నాయి. తమ దృష్టికి వస్తున్నవి అతి తక్కువ అని అంతకు పదిరెట్ల సంఖ్యలో వ్యభిచార కేంద్రాలుఉండవచ్చని ఒక పోలీసు అధికారి చెప్పారు. సినిమాస్టూడియోలు, ఫైవ్‌స్టార్‌ హోటళ్ళలోఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాతాము నిస్సహాయంగా ఉండిపోవలసి వస్తోందనిపోలీసులు అంటున్నారు. ఫ్లాట్‌లోఉండే సింగిల్‌ వుమన్‌ ప్రాస్టిట్యూషన్‌నుఎవరూ గుర్తించలేరని, అటువంటికేసులను కోర్టులో నిరూపించడంకష్టమని చెబుతున్నారు. రోడ్ల మీద నిలబడిపొట్టకూటి కోసం విటులనుఆకర్షించేవారు కొందరైతే ఫ్యాన్సీకారుల్లో తిరుగుతూ హైలెవల్‌ వ్యభిచారంసాగిస్తున్న వారుమరికొందరు. వ్యభిచారకార్యకలాపాల్లో నగరంలో రోజూ చేతులుమారే ధనం కోట్లలో ఉంటుందని అంచనా.

పివినరసింహుడి కొడుకు నిర్వాకం

పండితపుత్ర పరమ శుంఠ అన్న నానుడినిమాజీ ప్రధాని పివి నరసింహారావుతనయుడు పివి రంగారావు నిజం చేశారు. ఆయన తనభవనాన్ని ఒక బార్‌కి అద్దెకు ఇవ్వగా, బార్‌యజమాని అద్దె చెల్లించడం లేదట. పైగా అతనుకోర్టును ఆశ్రయించాడు. దీనితో మాజీ ప్రధానిగారి అబ్బాయి కొందరు ఆకు రౌడీలను బార్‌మీదికి పంపి అద్దాలు, గ్లాసులు, మందు బాటిల్స్‌ పగులగొట్టించారు. ఆబార్‌ యజమాని పోలీసులను ఆశ్రయించగావారురంగారావు, ఆయన అనుచరులపై మూడు సెక్షన్ల కిందకేసులు పెట్టారు.పివి రంగారావు గతంలో ఒక సినిమా తీస్తాననిరజనీకాంత్‌ నుంచి డబ్బు పుచ్చుకుని తిరిగి ఇవ్వకపోవడంతోరజనీ కేసు పెట్టారు. గతంలో రాష్ట్ర మంత్రిగాకూడా పనిచేసిన రంగారావుకు యాభైఅయిదేళ్ళు దాటాయి. ఆయనకు ఇంకా పెళ్ళికాలేదు.

మెత్తబడినతెలంగాణ రాష్ట్ర సమితి

అందితే జుట్టుఅందకపోతే బొట్టు అన్నట్టు వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్రసమితి నాయకులు ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి మీద వరంగల్‌ బహిరంగ సభలో ఘాటువిమర్శలు చేసేఅవకాశం లేదు. వైఎస్‌పై ఇటీవలటిఆర్‌ఎస్‌ నాయకుడు నరేంద్ర చేసినవ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తిపై మిత్రపక్షనాయకులుఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్‌అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకుంది.టిఆర్‌ఎస్‌ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ నాయకులంతా సమైక్యమై వైఎస్‌కుఅండగా నిలిచారు. టిఆర్‌ఎస్‌కువ్యతిరేకంగా అధిష్టానవర్గానికి ఫ్యాక్స్‌ సందేశాలు పంపారు.వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటిఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణపై హామీపొందేవరకు సంయమనంతోవ్యవహరించాలని నిర్ణయించుకున్నారు.వరంగల్‌ సభకు జనాన్ని తరలించేపనిలో టిఆర్‌ఎస్‌ మంత్రులు మునిగితేలుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X