హోంపేజి
ఎన్నికలకు ఏడాది ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ అనుకుంటున్నట్టు ఒక తెలుగు దిన పత్రిక నేడు పతాక శీర్షికతో ఒక గాలి వార్తను ప్రచురించింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీకి ఈ విషయం చెప్పినట్టు ఆ వార్త సారాంశం. ఆ ఎంపీ ఎవరో రాయకుండా ఆ పత్రిక ఒక ముఖ్యమైన వార్తను రాయడం ఎంత వరకు సమంజసం? తెలంగాణ విషయంలో సోనియా గాంధీ ఏమనుకుంటున్నారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఆమెకు సంబంధించినంతవరకు ఆంధ్రప్రదేశ్ ఒక అదృష్ట సంకేతం. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆమె దృష్టిలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన శక్తి. ఆమె మదిలో వైఎస్ ఏది చెబితే అదే వేదం, అదే బైబిల్ అన్న విషయం హైకమాండ్‌లో ప్రధాన నాయకులందరికీ తెలుసు. ఒక టీవీ ఛానల్, ఒక తెలుగు దినపత్రిక తెలంగాణ విషయంలో ఇంత తొందర పాటుగా వ్యవహరించడం వెనుక స్వార్ధ ప్రయోజనాలు ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ రాష్ట్ర విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందన్నది గత రెండేళ్ళుగా ఉన్న ఒక వైల్డ్ గెస్. దానిని పట్టుకుని పతాక శీర్షికలు పెట్టడం సబబా?
చంద్రశేఖరరావు
పూర్వీకులు
శ్రీకాకుళం
వారా?
సింగపూర్
టౌన్‌షిప్‌లో
ఫ్లాట్
బెస్ట్‌బై