కడపలో అతి పెద్ద అన్నమయ్య విగ్రహం
భక్త కవి, గాయకుడు తాళ్ళపాక అన్నమాచార్య తన కీర్తనలతో ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా జనం గుండెల్లో నిలిచిపోయారు. ఆయన కీర్తనల్లోని అచ్చ తెలుగు సొగసులు అందరికీ తెలిసినవే. అన్నమయ్యగా నటించి నాగార్జున ఆయనకు గొప్ప నివాళి ఘటించగా, ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇంకో గొప్ప పని చేస్తున్నారు.
కడప జిల్లా రాజం పేట మండలంలోని తాళ్ళపాక రోడ్ జంక్షన్ లో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని త్వరలో ప్రతిష్టించనున్నారు. దీనికయ్యే 2 కోట్ల 90 లక్షల ఖర్చును తిరుమల తిరుపతి దేవస్ధానం భరించనుంది. తన సొంత జిల్లా కాబట్టి రాజశేఖరరెడ్డి ఈ కార్యానికి చొరవ తీసుకున్నట్టు సమాచారం.
అన్నమయ్య విగ్రహం రాష్ట్రంలోని అతి ఎత్తైనది కానుంది. పనులు ప్రారంభించిన తర్వాత 12 నెలల్లో విగ్రహ ప్రతిష్ట పూర్తవుతుందని అంచనా. హుస్సేన్ సాగర్ లో ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటైన బుద్ధ విగ్రహం ఎత్తు 54 అడుగులు మాత్రమే. అన్నమయ్య విగ్రహం వద్ద ఆయనకు సంబంధించిన ఇతర ఆకర్షణలను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.












Click it and Unblock the Notifications