చిరంజీవి చెప్పినట్టే "చిరుత"
"చిరుత" సినిమాలో కథ పల్చబడిపోయిందని, కొత్త హీరో రామ్ చరణ్ తేజ చక్కగా ఎస్టాబ్లిష్ అయ్యాడని "దట్స్ తెలుగుడాట్ కాం" సహా దాదాపు అన్ని పోర్టల్స్, వెబ్ సైట్స్ సమీక్షించాయి. ఈ విషయంలో భిన్నాభిప్రాయం "ఈ-మీడీయా"లో వ్యక్తం కాలేదు.
చిరంజీవి చెప్పినట్టే ఈ సినిమాను పూర్తిచేశానని, తొలికాపీని చూసిన తర్వాత ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూశానని దర్శకుడు పూరీ జగన్నాధ్ అంటున్నారు. చిరంజీవి వంటి మెగా హీరోకి సినిమా నచ్చిందంటే తన బాధ్యతను తాను చక్కగా నిర్వర్తించినట్టేనని పూరీ అనుకుంటున్నారు.
"చిరుత" సినిమాను సూపర్ హిట్ చేయాలన్న ఉద్దేశంతో కాకుండా, హీరోని తిరుగులేని రీతిలో ఎస్టాబ్లిష్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో తీసినట్టు కన్పిస్తోందని దట్స్ తెలుగు తొలిరోజే రాసింది. మొత్తంగా సినిమా ఎలా ఉన్నా తన సత్తా నిరూపించుకున్న చరణ్ తేజ తన తదుపరి సినిమాలతో సంచలనం సృస్టించాలని ఆశిద్దాం.












Click it and Unblock the Notifications