'ఇంద్ర' తర్వాత 'సమరసింహారెడ్డి'

Balakrishna
హైదరాబాద్‌: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తర్వాత యువరత్న బాలకృష్ణ రాయలసీమలో పర్యటించునున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన సీమ యాత్ర చేయనున్నారు. రాయలసీమ ప్రజలు ఇంద్రకు పట్టం కడుతారో, సమరసింహారెడ్డిని ఆదరిస్తారో వేచి చూడాల్సిందే. డిసెంబరు మూడో వారంలో రాయలసీమలో బాలయ్య తన రాజకీయ పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. రాయలసీమలో బాలకృష్ణకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని అక్కడి నుంచే యాత్రను ప్రారంభించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఇంకా కార్యక్రమం ఖరారు కాలేదు. కానీ ఆయన రోడ్‌షోల కోసం అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. యువగర్జనతో క్రియాశీల రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన బాలకృష్ణ ఇక ప్రజాయాత్రలు కూడా చేపట్టాలని నిర్ణయించారు. సీమతో మొదలుపెట్టి అనంతరం కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లోనూ రోడ్‌షోలు నిర్వహించే అవకాశముందని పార్టీ నేత ఒకరు తెలిపారు. ఒక సినిమా షూటింగ్‌ నిమిత్తం రెండు రోజుల క్రితమే మలేషియా వెళ్లిన ఆయన డిసెంబరు మొదటి వారంలో తిరిగి రానున్నారు. ఆ తరువాత ఇక్కడ సినిమా షూటింగ్‌ ఉంది.

వీలు చూసుకుని డిసెంబరు నుంచి ఎన్నికల వరకు పార్టీకోసం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని సమాచారం. రాయలసీమలో బాలకృష్ణ రోడ్‌షోలు పార్టీకి మరింత ఊపునిస్తాయని తెదేపా వర్గాలు అంచనా వేస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు 'మీకోసం' యాత్రకు ఉపయోగించిన పసుపురంగు వాహనాన్నే బాలకృష్ణ ఈ యాత్రకు ఉపయోగించనున్నారని సమాచారం. బాలయ్య మలేషియా వెళ్లేముందు ఈ రథాన్ని ఎక్కి ఎలా ఉంది, అందులోంచి ప్రజలందరికీ కనబడతామా లేదా అనేది పరిశీలించారని, కొన్ని మార్పులు కూడా సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ వాహనం కాకుండా కొత్తగా మరో వాహనాన్ని సిద్ధం చేసే ఆలోచన కూడా ఉందని ఆ వర్గాలు వివరించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+