జోగయ్యను చిరు ఏం చేస్తారు?

ఇప్పుడాయన ప్రజారాజ్యం పార్టీలోనూ అదే పని చేస్తున్నారు. చిరంజీవికి ఆయన రాసిన లేఖ వివరాలు ఒక్క "సాక్షి" పత్రికకు మాత్రమే ఎందుకు లీక్ అయ్యాయి? ఆయన ఆ పత్రికను ఎంచుకున్నారు కాబట్టే. "ఈనాడు", "ఆంధ్రజ్యోతి" పత్రికలు చిరంజీవికి కొమ్ము కాస్తున్న విషయాన్ని తన సన్నిహితులతో చర్చించిన జోగయ్య పతాక శీర్షికగా తన లేఖ వార్త రావాలంటే "సాక్షి" బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
"సాక్షి" సర్క్యులేషన్ లో దాదాపు నెంబర్ వన్ గా ఉండడంతో ప్రచారం కోసమే గాక చిరంజీవికి సంకేతాలు పంపడానికి అది మంచి మాధ్యమం అని జోగయ్య భావించి ఉండాలి. తన కంటే పెద్ద పదవులు నిర్వహించిన శివశంకర్, ఉపేంద్ర వంటి వారు ప్రజారాజ్యం పంచన చేరడం (ఉపేంద్ర ఇంకా అధికారికంగా చేరవలసి ఉంది) జోగయ్యకు కంటగింపుగానే ఉండవచ్చు. కానీ జోగయ్య కోపానికి అదొక్కటే కారణం కాదు. పార్టీ సంస్ధాగత వ్యవస్ధలో లోపాలున్నాయన్నది ఆయన ఆందోళనగా కనిపిస్తోంది.
జోగయ్య వంటి పెద్ద దిక్కు రాసిన లేఖను చిరంజీవి పాజిటివ్ గా తీసుకుని పార్టీని చక్కదిద్దుతారా? జోగయ్యను కోవర్టుగా భావించి సస్పెండ్ చేస్తారా? లేదా నిర్లక్ష్యం చేసి ఆయనను క్రమంగా దూరం చేసుకుంటారా అన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications