చంద్రబాబు మారరా?

తన పార్టీలో ఉన్న వివిధ కులాలకు చెందిన అగ్ర నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆయా వర్గాల వారి మద్దతును టిడిపికి తెచ్చేలా చంద్రబాబు నాయుడు విప్లవాత్మక నిర్ణయాలను తీసుకో వలసి ఉంది. ఉదాహరణకు ఎర్రంనాయుడిని ఆ మూడు జిల్లాలకు సంబంధించి నియోగించాలి. యాదవ కులానికి చెందిన యనమలను రాష్ట్ర మంతటా తిప్పాలి. కానీ కొన్ని భయాల వల్ల చంద్రబాబు నాయుడు తన తర్వాతి నాయకులకు కావలసినంత స్వేచ్చ ఇవ్వడం లేదు.
బిసీలే పునాదిగా ఎదిగిన పార్టీ తెలుగుదేశం. ఇప్పటికీ ఆ పార్టీకి పెట్టని కోటగా ఉన్నది బీసీలే. చంద్రబాబు నాయుడికి ఆ సత్యం తెలిసినా, ఆయన నేల విడిచి సాము చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వ్యవహార శైలితో విసిగిపోవడం వల్లనే ఈనాడు రామోజీరావు చిరంజీవికి, చంద్రశేఖరరావుకు మద్దతు ఇస్తున్నట్టు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications