ఇక చిరంజీవిపై చంద్రబాబు దాడి?

కాంగ్రెస్ పార్టీ నుంఛి హరిరామ జోగయ్య వంటి ఒకరిద్దరు సీనియర్ నాయకులు మినహా చిరంజీవి పార్టీలో చేరే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఆంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు డజను మందికి పైగా చిరంజీవి పార్టీలో చేరుతామంటూ ఫీలర్లు వదిలినట్టు సమాచారం.
ఈ నేపధ్యంలో చిరంజీవి ఇమేజిని దెబ్బతీసే విషయాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు చంద్రబాబు నాయుడు హయాంలోనే జూబిలీహిల్స్ లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు ఇచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కమర్షియల్ గా మారిపోయిన విషయాన్ని ప్రజల ముందుకు తేవాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. మరో వైపు ఎన్టీఆర్ పేరిట సమాజ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications