నెలరోజుల్లో చిరంజీవి రోడ్ షోలు?

చిరంజీవి చుట్టూ ఉండే వాళ్ళు పక్కా ఆంధ్రావాలాలు కావడం, వారికి సామాజిక, ఆర్ధిక,భౌగోళిక, సాంస్కృతిక వాస్తవాలు ఆయన సలహాదారులకు తెలియకపోవడం వల్ల చిరంజీవి చాలా కాలం సందిగ్ధానికి గురయ్యారు. కానీ ఆయన " ప్రత్యేక తెలంగాణ", "ఆంధ్ర అభివృద్ధి ", "అవినీతి నిర్మూలన" అనే నినాదాలతో ముందుకు వస్తే చిరంజీవి పార్టీ హిట్ అవుతుందని "దట్స్ తెలుగు డాట్ కాం" మొదటి నుంచి రాస్తూ వస్తోంది.
ఇప్పుడు చిరంజీవి అదే బాటలో పయనిస్తున్నారు.అయనకు, టీఅర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేరరావుకు, తెలుగుదేశం పార్టీకి మధ్య సీట్ల సర్దుబాటు జరిగినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. నియంతలా వ్యవహరిస్తున్న వైఎస్ కు చెక్ పెట్టడానికి సిద్ధమవుతున్న రాజకీయ శక్తులకు రామోజీరావు నాయకత్వం వహించే అవకాశముంది.












Click it and Unblock the Notifications