హిట్ దిశగా చిరు స్టెప్స్

చిరంజీవి, లెఫ్ట్, టీఅర్ ఎస్ కలిస్తే తెలంగాణలో ఆ మెగా కూటమికి ఎదురు ఉండదని, కాంగ్రెస్ సోదిలోకి లేకుండా పోతుందని, తెలుగుదేశం అతి తక్కువ స్ధానాలతో సరిపెట్టుకోవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. మరి కోస్తా, రాయలసీమ మాటేమిటి? అక్కడ లెఫ్ట్ బలం చాలా తక్కువ కావడంతో చిరంజీవి ఈ కూటమి విజయ భారాన్ని తన భుజం మీదనే వేసుకోవలసి ఉంటుంది. ముందున్నది మొసళ్ళ పండుగ అన్న సామెతను చిరంజీవి "శంకర్ దాదా ఎంబిబిఎస్" సిన్మాలో "ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్" అంటుంటాడు. లెఫ్ట్ తో, కెసి ఆర్ తో సీట్ల సర్దుబాటు విషయంలో అదే జరిగే అవకాశముంది. దానిని అధిగమించగలిగితే నిజంగా చిరంజీవి పండుగ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications