చిరంజీవి పార్టీకి మరో దెబ్బ?

ఇప్పుడు మరో ప్రమాదం పొంచి ఉంది. "ప్రజాపార్టీ" ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న పార్టీ. దాని అధ్యక్షుడు ఇ.గిరియాదవ్. ఆయన పదేళ్ళ క్రితమే ఆ పార్టీని స్ధాపించి, జిల్లాల్లో పర్యటిస్తూ కేడర్ ను పెంచుకుంటున్నారు. ప్రగతిశీల భావాలుగల పార్టీగా దానికి పేరుంది. చిరంజీవి "ప్రజారాజ్యం" తన పార్టీ పేరును పోలి ఉందని, పదేళ్ళుగా తాను డెవలప్ చేసుకున్న కేడర్ అయోమయంలో పడే అవకాశముందంటూ గిరియాదవ్ హైకోర్టును ఆశ్రయించే అవకాశముంది.
కొత్త పార్టీకి ఆ పేరు ఇవ్వవద్దంటూ యాదవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వీలులేనందున ఆయన తన కేడర్ అయోమయంలో పడుతుందంటూ హైకోర్టుకు వెళ్ళే అవకాశముంది. రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్ధానంలో ఉన్న ఒక న్యాయవాది గిరియాదవ్ కు ఈ న్యాయ సలహా ఇచ్చినట్టు సమాచారం. అయితే పెద్ద మనిషి అయిన గిరియాదవ్ న్యాయస్ధానాన్ని ఆశ్రయించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారట.
ఒక వేళ గిరియాదవ్ న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తే తాత్కాలికంగా అయినా "ప్రజారాజ్యం" పార్టీకి బ్రేకు పడే అవకాశముంది. అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసి విజయం సాధించిన గిరియాదవ్ కు న్యాయమూర్తుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాబట్టి న్యాయం చేయమంటూ ఆయన పిటిషన్ వేస్తే, "ప్రజారాజ్యం" పేరు ఊపయోగంపై కనీసం ఒకటి రెండు నెలలు స్టే వచ్చే అవకాశముంది. అది చిరంజీవి పార్టీకి పెద్ద నష్టమే కలిగించవచ్చు.












Click it and Unblock the Notifications