చిరంజీవి ఇలా మారితే మంచిది

Chiranjeevi
దాదాపు ఇరవై ఏళ్ళ పాటు ఒక దేవేంద్రుడిలా నాలుగు గోడల మధ్య తన ప్రైవేటు జీవితాన్ని గడిపిన చిరంజీవికి ఇప్పుడు కష్టకాలం వచ్చినట్టే కనిపిస్తోంది. మొదట్లో సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోడానికి కఠోర శ్రమ, క్రమశిక్షణ పాటించిన చిరంజీవి ఆ తర్వాత నటనలో ఇంకా మెరుగుపడ్డారు. కానీ ఆయనకు ఎప్పుడైతే సూపర్ స్టార్ స్టేటస్ వచ్చిందో అప్పటి నుంచి అయితే షూటింగ్ లకు లేకుంటే నాలుగు గోడలకు మధ్య పరిమితమై పోయారు.

ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టుకుని ప్రజల ముందుకు వచ్చిన చిరంజీవికి అన్నీ కొత్తగా కన్పించడంలో ఆశ్చర్యం లేదు.ఈ కొత్త వాతావరణానికి ఆయనకు చాలా కాలమే పట్టవచ్చు. మేకప్ వేసుకుని కెమెరా ముందు నిలబడడం వేరు, ఎండల్లో, వానల్లో ప్రజల మధ్య తిరగడం వేరు. అయితే ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చిన ఆయనకు సంకల్పబలం మరింత బలపడితే వాతావరణ సమస్యలు పెద్ద కష్టం కాబోవు.

కానీ ఇప్పుడు చిరంజీవికి మొండితనం కావాలి, ప్రజలకు సేవ చేయడానికి, మెరుగైన సమాజాన్ని స్ధాపించడానికి ఆయన కొన్ని ఆబ్లిగేషన్లను ఒదులుకుని ఎన్టీఆర్ లా మొండిగా ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఆయనను కమాండ్ చేయాలని చూసే ఇన్నర్ సర్కిల్ బలహీనపడి, ప్రజలే ఆయనకు చేరువ అవుతారు. ఈ సమయంలో చిరంజీవి అలవర్చుకోవాల్సిన లక్షణం అదే. ఆయన రాజకీయాల్లో కూడా సినిమా తరహాలో వ్యవహరిస్తే పరిస్ధితులు మరో రకంగా పరిణమిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+