బాలకృష్ణ వైపు దాసరి!

తల్లి వంటి సినిమా రంగంలోకి ఆయన భారీగా ప్రవేశించినట్టే. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా ఆయన విశ్వరూపం ప్రదర్శించనున్నారు. మొదట్లో చిరంజీవికి క్లోజ్ గా ఉన్నా ఆ తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చాయి. సినీరంగ ప్రముఖులకు చిరంజీవి తేనీటి విందు ఇచ్చినప్పుడు దాసరి హాజరు కాలేదు.
హీరో బాలకృష్ణతో "బొబ్బిలిపులి" అనే సినిమా తీయడానికి దాసరి సిద్ధమవుతున్నట్టు సమాచారం. వచ్చే నెలలో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించనున్న బాలకృష్ణకు ఈ సినిమా గొప్ప రాజకీయ భవిష్యత్తును ఇవ్వగలదని పరిశీలకులు భావిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ మంచి మిత్రులైనా ఇప్పుడు రాజకీయ ప్రత్యర్ధులైపోయారు. అయినా వీరిద్దరూ రాజకీయాలను స్పోర్టివ్ స్పిరిట్ తో తీసుకుని, కొత్త రాజకీయాలకు నాంది పలకాలని ఆశిద్దాం.












Click it and Unblock the Notifications