జయసుధకు ముట్టినదెంత?

దీనితో రగిలిపోయిన జయసుధ కాంగ్రెస్ నాయకులకు ఫీలర్లు పంపినట్టు తెలుస్తోంది. తనకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని జయసుధ ప్రస్తావించగా అవన్నీ తాము చూసుకుంటామని కాంగ్రెస్ నాయకులు ఆమెకు అభయం ఇచ్చి పార్టీలోకి చేర్చుకున్నట్టు ఒక కథనం. కాంగ్రెస్ తరఫున ప్రచార రంగంలోకి దిగనున్న సినిమా వాళ్ళకి భారీ మొత్తంలో నజరానాలు, ఫేవర్లు జరిగినట్టు తెలుస్తోంది. చిరంజీవి పార్టీ పెట్టక ముందే ఆయన మీద చెలరేగిపోయిన హీరో రాజశేఖర్ కు జూబిలీహిల్స్ లోని స్ధలానికి ఫేవర్ చేయడానికి కాంగ్రెస్ ప్రముఖులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications