పవన్ వల్ల లాభమా? నష్టమా?

Pawan Kalyan
పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి ఇంచార్జిగా మారినట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు యువతరంలో, మంచి టేస్ట్ ఉన్న ఎలీట్ సెక్షన్లలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. చిరంజీవి జిల్లాల పర్యటనలో ఉన్నప్పుడు పవన్ గ్రేటర్ హైదరాబాద్ లో ని ముఖ్యమైన కేంద్రాల్లో పర్యటిస్తారు. ఆయన పెద్దగా బహిరంగ సభల్లో ప్రసగించకపోయినా అనేక చోట్ల ప్రజారాజ్యం జెండాలను ఎగురవేసి అభిమానులను ఉత్సాహపరుస్తారు.

పవన్ కళ్యాణ్ వల్ల చిరంజీవికి ఎంత లాభం కలుగనుందో అంతే స్ధాయిలో నష్టం జరుగుతుందేమోనని చిరు శ్రేయోభిలాషులైన సీనియర్ రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హిమాలయ శిఖరమంత సహనంతో అందరినీ కలుపుకుని పోవాలని, ఆవేశాలకు పోతే ప్రజలు హర్షించరని వీరు అనుభవంతో హితవు చెబుతున్నారు.

గతంలో గూండాల చేతిలో అవమానాలకు గురైన పవన్ కళ్యాణ్ కు చట్టప్రకారం అటువంటి వారిని అణిచివేయాలన్న ఆకాంక్ష మనసులో పేరుకు పోయింది. అన్నయ్య రాజకీయాల్లోకి రావాలని తమ్ముడు మనసరా ఆకాంక్షించింది అందువల్లనే. గూండాల చేతుల్లో సామాన్యులు బలి కాకూడదని, అందుకోసమ్ ఒక మెకానిజమ్ ఉండాలని కలలు గంటున్న పవన్ కు చిరు పార్టీ మెగా బలాన్నిచ్చింది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఆవేశం తగ్గించుకుని లౌక్యంగా వ్యవహరిస్తే తన గోల్ ను సులభంగా చేరుకోగలడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+