బాలీవుడ్‌ను వణికిస్తున్న గ్యాంగ్స్టర్లు.. మరో స్టార్ హీరోకు బెదిరింపులు!
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని బెదిరింపు కాల్స్, గ్యాంగ్స్టర్ల నెట్వర్క్ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రముఖ నటుడు తుషార్ కపూర్ తర్వాత తాజాగా మరో స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. తనకు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా పరిచయం చేసుకున్న సదరు గుర్తుతెలియని వ్యక్తి ఆయుష్మాన్ ఖురానా నుంచి కోట్ల రూపాయలను డిమాండ్ చేశాడని పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపు కాల్ పై కేసు నమోదు చేసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ ఆడియో రికార్డింగ్‌ను తమ డేటాబేస్‌లోని వాయిస్ శాంపిల్స్‌తో పోల్చి చూసే పనిలో పడ్డారు.
'హారీ బాక్సర్' పేరుతో నకిలీ కాల్స్?
ఇటీవల నటుడు తుషార్ కపూర్‌కు కూడా 'హారీ బాక్సర్' పేరుతో సరిగ్గా ఇలాంటి బెదిరింపు ఆడియో సందేశమే వచ్చింది. దీనిపై విచారణ జరిపిన క్రైమ్ బ్రాంచ్ సాంకేతిక బృందం, ఆ రికార్డింగ్ ను తమ వద్ద ఉన్న 'హారీ బాక్సర్' అధికారిక వాయిస్ శాంపిల్స్ తో పోల్చిచూసింది. అయితే ఆ రికార్డింగ్ వాయిస్ శాంపిల్స్‌తో సరిపోలకపోవడంతో.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును వాడుకుని, నటులను భయపెట్టి డబ్బులు గుంజడానికి ఎవరైనా వ్యాపార వ్యూహంతో నకిలీ కాల్స్ చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

టైగర ష్రాఫ్‌పై కాల్పుల ఘటనతో పెరుగుతున్న భయం
అంతకుముందు అక్టోబర్ 18న ముంబైలోని జుహు వద్ద ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటన తీవ్ర ఘటన కలకలం రేపింది. ఈ దాడి నుంచి టైగర్ ష్రాఫ్ తృటిలో తప్పించుకోగా.. ఆయన డ్రైవర్‌తో పాటు మరో బాటసారికి గాయాలయ్యాయి. ఈ కాల్పుల ఘటనకు లారెన్స్ బిష్ణోయ్ ముఠానే బాధ్యత వహించింది. ఈ కేసులో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన అనుచరుడు అనిల్ పండిత్‌ను మోస్ట్ వాంటెడ్‌గా పేర్కొన్న పోలీసులు.. ఇప్పటివరకు ఇద్దరు షూటర్లతో సహా 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖుల నివాసాల వద్ద కడా రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది.
స్టార్ల నివాసాల వద్ద బుల్లెట్ ప్రూఫ్ భద్రత
వరుస ఘటనల నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు తమ వ్యక్తిగత భద్రతను భారీగా పెంచుకుంటున్నారు. అదివారం తన నివాసం 'జల్సా' బయట అభిమానులను కలవడానికి వచ్చిన అమితాబ్ బచ్చన్.. ఈ సారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఎన్‌క్లోజర్ వెనుక నిలబడి అభివాదం చేశారు. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ భద్రతా ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు. నవంబర్ 2న షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసం 'మన్నత్' పరిసరాల్లో పోలీసులు భారీగా బందోబస్టు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కాంపౌండ్ వాల్ లేదా ప్రత్యేక మెట్లపైకి వచ్చి దగ్గరగా అభిమానులకు గ్రీటింగ్స్ చెప్పే షారుఖ్.. ఈ సారి దూరంగా తన ఇంటి టెర్రస్ పైనుంచే అభిమానులకు అభివాదం చేసి వెళ్లారు.













Click it and Unblock the Notifications
