ఒంగోలు కొత్త మేయర్ గా - అనూహ్య ఫలితం..!!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఆలస్యం అయిన మున్సిపాల్టీల కౌంటింగ్ పూర్తయింది. అందులో భాగంగా ఒంగోలు కార్పోరేషన్ ఫలితాలను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 13 మున్సిపల్ కార్పోరేషన్లలో 11 స్థానాలు కూటమి పార్టీలే దక్కించుకున్నాయి. అనంతపురంలో వైసీపీ విజయం సాధించింది. కాగా.. ఇప్పుడు ఒంగోలు కార్పోరేషన్ లోనూ ఆసక్తి కర ఫలితాలు వెల్లడయ్యాయి.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఏకపక్షంగా విజయాలు నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ అనంతపురం కార్పోరేషన్ తో పాటుగా నాలుగు మున్సిపాల్టీలను గెలుచుకుంది. మిగిలిన 12 కార్పోరేషన్లు.. మున్సిపాల్టీలను కూటమి పార్టీలు గెలుచుకున్నాయి. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి మరో సారి 100 శాతం స్ట్రైకింగ్ రేటు నమోదు చేసుకుంది.

కాగా.. భారీ వర్షాల కారణంగా ఒంగోలు కార్పోరేషన్ ఎన్నిక ఆలస్యం అయింది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావటంతో ఫలితాలను అధికారులు వెల్లడించారు. ఒంగోలు కార్పొరేషన్ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి శ్రీశిల్ప విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌పై 37,172 ఓట్ల మెజారిటీతో శ్రీశిల్ప గెలుపొందారు. దీంతో.. కూటమి గెలిచిన కార్పోరేషన్ల సంఖ్య 12కు చేరింది. ఇక్కడ మెజార్టీ వార్డులను టీడీపీ సొంతం చేసుకుంది.
ఒంగోలు లో మొత్తం 62 డివిజన్లు ఉన్నాయి. అందులో టీడీపీ 40 స్థానాల్లో గెలవగా, జనసేన 7 వార్డుల్లో విజయం సాధించింది. అదే విధంగా బీజేపీ ఒక్క స్థానంలో విజయం దక్కించుకుంది. ఇక, వైసీపీ 11 స్థానాలను సొంతం చేసుకోగా.. మూడు స్థానాలు ఇతరులకు దక్కాయి. కూటమి పార్టీల్లో పొత్తుల్లో భాగంగా జనసేన నాలుగు కార్పోరేషన్లలో పోటీ చేసి విజయవాడ, ఏలూరులో గెలిచింది. మరో స్థానాలు కాకినాడ, శ్రీకాకుళంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. బీజేపీకి కేటాయించిన అనంతపురం కార్పోరేషన్ లో వైసీపీ విజయం సాధించింది. ఇక.. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక లు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే వీటిల్లోనూ అన్నింటా విజయం సాధించేలా కూటమి నేతలు సమన్వయంతో పని చేయాలని మూడు పార్టీల నేతలు పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications
