బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్దులుగా - అనూహ్య ఎంపిక..!!
బీజేపీ అధినాయకత్వం తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాదయాత్ర నిర్వహించారు. అదే సమయంలో పార్టీ ముఖ్య నేతల కు కీలక దిశా నిర్దేశం చేసారు. 2028 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ.. ఉప ఎన్నికల పైనా కసరత్తు ప్రారంభించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీ అభ్యర్ధిని దాదాపుగా ఖరారు చేసింది.
తెలంగాణలో బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్ల కాలం పూర్తి కావటంతో.. ఇక వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం కావాలని పార్టీ నాయకత్వం తేల్చి చెప్పిది. ఇక.. ఎమ్మెల్సీ, ఖైరతాబాద్ ఉప ఎన్ని పైనా కొత్త మార్గదర్శకత్వం చేస్తోంది. అందులో భాగంగా త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటోంది. కాగా.. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పేరు ఖరారైనట్లు తెలిసింది. దిల్లీలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశం సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో రాంచందర్‌రావు అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతల సమాచారం. ఉత్తర తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థికి అవకాశం దక్కనుంది.

బీజేపీ నాయకత్వం తుది కసరత్తు
కాగా, రెండు నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే వారి పేర్లను సేకరించింది. ఒక్కో స్థానం నుంచి నలుగురి పేర్లతో అధిష్ఠానానికి ఆశావహుల లిస్ట్ పంపించారు. అందులో భాగంగా వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి బీసీ అభ్యర్థికే అవకాశం ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో డాక్టర్ వన్నాల వెంకట రమణతో పాటు రిటైర్డ్ ఉపాధ్యాయుడు భిక్షం గౌడ్ పేరును పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. భిక్షం గౌడ్ సైతం త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. రామచంద్ర రావు గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉండటంతో.. ఇప్పుడు తిరిగి పోటీలో ఉండటం ద్వారా కలిసి వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. రెండో అభ్యర్ధి పేరును అధికారికంగా ప్రకటించనుంది.













Click it and Unblock the Notifications
