పవన్ "జల్సా" కథ లీకయిందా?

"జల్సా" సినిమా కథ లీక్ అయిందని రేడియో జాకీ చెప్పాడు. రేడియో జాకీలు సరదాగా చెప్పే విషయాలను శ్రోతలు సీరియస్ గా పట్టించుకోరు. కానీ లీక్ అయిన కథను ఆ జాకీ పూసగుచ్చినట్టు చెప్పడంతో కొంతవరకు నమ్మడానికి అవకాశమేర్పడింది.
ఆ ఎఫ్ ఎం రేడియో వెల్లడించిన ప్రకారం ఈ సిన్మాలో పవన్ కల్యాణ్ అమాయకపు విద్యార్ధి. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె నిరాకరించడంతో భగ్న ప్రేమికుడవుతాడు. ఆ తర్వాత పవన్ ఇలియానా ప్రేమలో పడి జీవిత మాధుర్యమేమిటో తెలుసుకుంటాడు. ఇలియానా . ఇలియానా కూడా అతడిని పిచ్చిగా ప్రేమించేయడంతో, వారిద్దరి మధ్య బాడీ కెమిస్ట్రీ బాగా కుదరడంతో సీన్లు అన్నీ పండాయి. పార్వతీ మెల్టన్ వచ్చి వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. అన్ని అడ్డంకులు తొలగిపోయి పవన్ , ఇలియానా జల్సాగా చిందులేయడంతో సుభం కార్డు పడుతుందట.












Click it and Unblock the Notifications