బాలయ్య వర్సెస్ పవన్

Pawan Kalyan
కడప లోక్ సభ స్ధానం నుంచి ఈసారి ముగ్గురు కథానాయకులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తలపడనున్నారు. కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా వైఎస్ జగన్ అభ్యర్ధిత్వం దాదాపు ఖరారైనట్టే. ఆయన మీద ప్రజారాజ్యం అభ్యర్ధిగా పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేయడానికి పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేగాక అక్కడ ప్రచారానికి బాలకృష్ణను ప్రత్యేకంగా పంపిస్తామని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ముగ్గురూ యువకులే. ముగ్గురూ మూడు రంగాల్లో పెద్ద కథానాయకులే. ఆ మూడు పార్టీల తరఫున ఈ ముగ్గురి అభ్యర్ధిత్వాలు ఖరారైతే రాష్ట్రంలోనే కడప లోక్ సభ స్ధానం ఎన్నిక అత్యంత ఉత్కంఠ భరితం కానుంది.

కడప నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి పెట్టని కోట వంటిది. అటువంటి కోటలోకి పవన్ కళ్యాణే ప్రవేశించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై బ్లాగ్స్ లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. శ్రీకాంత్ రెడ్డి తరఫున బాలకృష్ణ ఇక్కడ ప్రత్యేకంగా ప్రచారం చేస్తే ఆయన విజయాకాశాలను కూడా కాదనలేం. జగన్ బాలకృష్ణ అభిమాని అంటూ కొన్ని బ్లాగ్స్ లో కొందరు రాస్తున్నారు. అదే నిజమైతే అక్కడ ప్రచారం చేయడానికి బాలకృష్ణ ప్రత్యేకంగా ఆసక్తి చూపకపోవచ్చు. అప్పుడు పవన్ కళ్యాణ్ కు విజయావశాలు ఉంటాయి. ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల మధ్య సమానంగా ఓట్లు చీలిపోతే జగన్ గెలిచి అసలు హీరోగా నిలబడతాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+