కమ్మవారికి గాలం

ఈసారి బహుముఖ పోటీలు అనివార్యమయ్యే పరిస్ధితులు ఉండడంతో రెండు మూడు వేల ఓట్ల తేడాతో అనేక నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్ధులు గెలుపొందుతారని అంచనా. అటువంటప్పుడు కమ్మ కులం ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోకుండా చూసుకుంటే కాంగ్రెస్ విజయం తధ్యమని వైఎస్ శిబిరం మేధావుల అంచనా. ఆ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ సన్నిహిత మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు పావులు కదుపుతున్నారు.
ఆయన కమ్మ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో ఈ విషయమై తరచుగా చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధరేశ్వరి, రేణుకా చౌదరి, కావూరి సాంబశివరావు వంటి కమ్మ దిగ్గజాలు ఇప్పుడు కాంగ్రెస్ లో కీలకపాత్ర వహిస్తున్నారు.
చిరంజీవి పార్టీ కూడా కమ్మ వారిని ఆకర్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మాజీ ఎంపీ రైతు నాయకుడు యలమచిలి శివాజీని ఇప్పటికే పార్టీలో చేర్చుకుని ముఖ్యమైన వ్యవసాయ విభాగం అప్పగించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్న కమ్మ నాయకులను ఆకర్షించడానికి నిర్మాత అశ్వనీదత్ ద్వారా ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications