'సాక్షి'కి భవిష్యత్తు ఉందా?

YS Jagan
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, మళ్ళీ ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి కొనసాగితే "సాక్షి" దినపత్రికకు ఢోకా ఉండదన్న అభిప్రాయం ఉంది. అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే "సాక్షి" భవిష్యత్తు ప్రశ్నార్ధకమన్న విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. సాక్షికి లూజ్ సేల్స్ అయినా, బలవంతపు సేల్స్ అయినా 13.5 లక్షల కాపీలు. ఈనాడు దాదాపు తొమ్మిది లక్షల కాపీలతో రెండో స్ధానంలో, ఆంధ్రజ్యోతి 5 లక్షల కాపీలతో మూడో స్ధానంలో ఉన్నాయి.

మొదట కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం వచ్చినా "సాక్షి"ని "ఈనాడు" కంటే ముందు ఉంచాలని వైఎస్ కుటుంబం సంకల్పించింది. కానీ ఇంత భారీ నష్టాలతో పత్రికను నడిపించడం కష్టమన్న విషయాన్ని ఆ గ్రూపు ఆర్ధిక విశ్లేషణ కర్తలు అభిప్రాయపడుతున్నారు. రీడర్ లాయల్టీ లెవల్ ఆ పత్రికకు తక్కువగా ఉందని మీడియా నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా, వైఎస్ ముఖ్యమంత్రి కాకపోయినా "సాక్షి" చానల్ నిలబడుతుంది కానీ వైట్ ఎలిఫెంట్ లాంటి "సాక్షి" దినపత్రిక మనుగడ కష్టమని చెబుతున్నారు. "సాక్షి" దినపత్రిక మీద రోజుకి కోటి రూపాయలు నష్టం వస్తోందని తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలను పట్ట్టించుకోనవసరం లేదు. కానీ ఖచ్చితంగా రోజుకి యాభై లక్షల రూపాయల నష్టం ఉంటుందని చెప్పవచ్చు.

అధికారంలో లేకుండా ఇంతటి తెల్ల ఏనుగును మేపడం కష్టమే. ఆ తర్వాత ఈ పత్రికను టేకోవర్ చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినా ఖర్చులు బాగా తగ్గించుకుని, రంగులు తగ్గించుకోడానికి ప్రయత్నిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+