ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ రెండేళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. జల్సా సినిమా తర్వాత రెండేళ్ల పాటు ఆయన సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. రాజకీయాలపై మనసు మళ్లడంతో పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సినిమా ప్రతిపాదనలతో ప్రస్తుతానికి తన వద్దకు రావద్దని నిర్మాతలకు ఆయన చెబుతున్నారట. తన సోదరుడు చిరంజీవి రాజకీయ ప్రవేశానికి పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేసుతున్నట్లు వినికిడి. జల్సా సెట్టింగ్సులోనూ ఆయన రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాల గురించే ఆయన మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. జల్సా మార్చి నెలాఖరులో విడుదలయ్యే సూచనలున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల మోజు ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.