జయసుధపై పవన్ 'గన్'

యువతను ఉర్రూతలూగించగల పవన్ ను గ్రేటర్ హైదరాబాద్ నగరానికే పరిమితం చేయడమెందుకన్న ప్రశ్న వస్తోంది. సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల సుదూర జిల్లాల్లో ఆయన పర్యటించడం కష్టం కాబట్టి చిరు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. తమ మీద విమర్శలు చేసిన వారిపై ఈ మధ్య చిరు బ్రదర్స్ బాగానే విరుచుకుపడుతున్నారు. చిరుపై విమర్శలు చేసిన రోజా మీద, జీవిత మీద పవన్ కళ్యాణ్ విసిరిన బౌన్సర్లకు మళ్ళీ వారి నుంచి జవాబు లేకుండా పోయింది. చిరంజీవి సభలకు వచ్చే వాళ్ళంతా ఓటేసే వాళ్ళు కాదని జయసుధ నిన్న కాంగ్రెస్ లో చేసిన సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి. పవన్ గనుక విమర్శల గన్ ను తెరిస్తే ప్రత్యర్ధులు ఇబ్బందుల్లో పడాల్సిందే.












Click it and Unblock the Notifications