పవన్, రాజశేఖర్ ల 'రాజకీయ' సిన్మాలు

ఇక ప్రజారాజ్యంకు సపోర్టుగా పవన్ కళ్యాణ్ తాజాగా ఖుషీ ఫేమ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తయారవుతున్న పులి చిత్రంలో కొన్ని డైలాగులు, సన్నివేశాలు చోటుచేసుకోబోతున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ పోలీస్ ఆపీసర్ గా కనిపించనున్నాడు. అలాగే ప్రజారాజ్యం పార్టీపై విమర్శలతో ...సిద్దాంతానికి వ్యతిరేకంగా ఉండే సన్నివేశాలు,డైలాగులతో సత్యమేవ జయితే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. జీవిత దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ ఖాఖి కి రీమేక్.
ఇంతకుముందు రాజశేఖర్ తన ఎవడైతే నాకేంటి చిత్రంలోనూ పొలిటికల్ సెటైర్స్ ఉండటాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు. నిజానికి సత్యమేవ జయితే చిత్రంలో పొలిటికల్ డైలాగులకు తావు లేకపోకపోయినా స్క్రిప్టు మార్చి కూర్చారని తెలుస్తోంది. ఈ రెండింటి సంగతీ ఇలా ఉంటే ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రధాన పాత్రలో గోకరాజు అనే ప్రభుత్వ ప్రచార చిత్రం నిర్మితమవుతోంది. మరో ప్రక్క ఎన్టీఆర్ మొన్న కంత్రిలోనే తెలుగుదేశం సపోర్ట్ గా కొన్ని డైలాగులు పేల్చి భవిష్యత్ లోనూ ఇలాంటి సన్నివేశాలు,డైలాగులు కామన్ అని సూచన ఇచ్చారు. రాబోయే చిత్రంలోనూ ఎన్టీఆర్ పోలీస్ పాత్రలో కనపడి కాంగ్రేస్ ని,ప్రజారాజ్యాన్ని దుయ్యపెడుతూ...తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే సన్నివేశాలు ఉంటాయన్నది పరిశ్రమ టాక్ .
అయితే ప్రస్తుతం మాత్రం పులి,సత్యమేవ జయితే రెండు చిత్రాలే ప్రజారాజ్యాన్ని అనుకూలంగా, ప్రతికూలంగా రంగంలో ఉన్నాయి. ఇక ఇలా సినిమాల ద్వారా పోరాటం ఎంతవరకూ సపోర్ట్ ఇస్తుందో గానీ, తమ పర్శనల్ ప్రయోజనాలకు సినిమాను ఓ సాధనంగా ఉపయోగించుకోవటం మాత్రం హర్షణీయం కాదనేది సీనియర్స్ సూచన.












Click it and Unblock the Notifications