చిరంజీవి ఐటీపై ఆరాలు

చిరంజీవికి సంబంధించి గోనె వాదన ఏమిటంటే ఆయన నిర్మాతల వద్ద పుచ్చుకున్న పారితోషికానికి సంబంధించి సరైన లెక్కలను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించలేదని. అందుకే ఆయన సమాచార హక్కు చట్టం కింద గత పాతికేళ్ళుగా చిరంజీవి ఫైల్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ కాపీలు కావాలని ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ వివరాలను సంబంధిత అధికారులు గోనె ప్రకాశరావుకు నెల రోజుల్లోపు అందజేయాలి. గోనెకు ఈ బ్రెయిట్ ఐడియా ఇచ్చింది గ్రేట్ లిటిగెంట్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ అని తెలుస్తోంది.
రామోజీరావుతో ఇప్పటికే పెద్ద యుద్ధం చేస్తున్న తాను మళ్ళీ చిరంజీవితో పెట్టుకోవడం సమంజసంగా ఉండదని, అందువల్ల ఈ పని కోసం తనకు గోనెను ఎటాచ్ చేయమని ఉండవల్లి ముఖ్యమంత్రి వైఎస్ ను కోరినట్టు తెలుస్తోంది. ఇలా సినిమా హీరోల ఆదాయపు పన్ను రిటర్న్ ల కోసం ప్రజలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేసుకుంటూ పోతే ఎన్నో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. సమాచార హక్కు చట్టం కింద ఇటువంటి సమాచారం పొందగోరేవారు చెల్లించాల్సిన ఫీజు ఎంతో తెలుసా? కేవలం పది రూపాయలే!












Click it and Unblock the Notifications
