చిరంజీవి సరసన నన్నపనేని రాజకుమారి?

Rajakumari
చిరంజీవి పార్టీలో చేరేందుకు మరికొందరు సీనియర్ నాయకులు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. రెండోసారి తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఆశించి భంగపడిన నన్నపనేని రాజకుమారి చంద్రబాబు నాయుడు మీద కోపంతో ఊగిపోతున్నారు. చిరంజీవి రాజకీయ పార్టీలో చేరడానికి ఆమె ఇప్పటికే సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. సీనియర్లకు, మహిళలకు 30 శాతం కోటా ఇస్తామంటున్న చిరంజీవి శిబిరం రాజకుమారిని సాదరంగా ఆహ్వానించే అవకాశముంది. రాజకుమారి మంచి వక్త. తాను నమ్ముకున్న నాయకుడిని రక్షించడానికి ఆమె మాటల ద్వారా ఎంత దూరం వెళ్ళ్డానికైనా వెనుకాడదు. 1983 లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసినా, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి ఆమె జనార్ధన రెడ్డి, విజయభాస్కరరెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో నిత్య అసమ్మతివాదిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆమె అంటే అసహ్యం.

వైఎస్ ఎప్పుడైతే రాష్ట్ర రాజకీయాల్లో పట్టు బిగించారో, ఇక తన పని అయిపోయినట్టేనని భావించిన రాజకుమారి ఇష్టం లేకపోయినా మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఆశ్రయించక తప్పలేదు. మహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి, చిన్ననదివంటి తెలుగుదేసం పార్టీలో ఈత కొట్టడం ఆమెకు సాధ్యం కాలేదు. అయినా తనకున్న నోటి బలంతో ఆమె కాంగ్రెస్ నాయకులకు దడపుట్టించింది. తెలుగుదేశం పార్టీకి ఇంతగా సేవ చేసినా తగిన గుర్తింపు లేకపోవడంతో ఆమె చిరంజీవి పార్టీలో చేరాలనుకుంటున్నారు. చిరంజీవి పార్టీలో కమ్మ కులానికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న అల్లు అరవింద్ ను రాజకుమారి ఇప్పటికే సంప్రదించి గుంటూరు జిల్లా వినుకొండ అసెంబ్లీ టికెట్ ను అభ్యర్ధించినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+